ఎండు ఫలాలు.. బహు లాభాలు

జీడిపప్పు, బాదంలో ఉండే మంచి కొవ్వులు గుండె ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి.

image:Pixabay 

 పిస్తాలోని బీ6 విటమిన్‌ గుండె సమస్యలను నివారిస్తుంది. ఇందులోని మంచి కొవ్వులు కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తాయి.

image:Pixabay

ఖర్జూరం రక్తనాళాల్లో సమస్యలు రాకుండా చేస్తుంది.

image:Pixabay

ఎండుద్రాక్షల్లో ఐరన్‌ దండిగా ఉంటుంది. ఇవి రక్తహీనత బారినపడకుండా కాపాడతాయి. వీటిలో ఉండే ఫాస్ఫరస్‌, పొటాషియం, మెగ్నీషియం రక్తప్రసరణ సాఫీగా జరిగేందుకు తోడ్పడతాయి.

image:Pixabay

జీడిపప్పులో రాగి ఎక్కువగా ఉండటం వల్ల శక్తి ఉత్పత్తి అవుతుంది. మెగ్నీషియం, క్యాల్షియం కండరాలు, చిగుళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

image:Pixabay

ఎండుద్రాక్షలో విటమిన్‌ ఎ, క్యాల్షియం దండిగా ఉంటాయి. ఇవి ఎముక పుష్టికి, కంటి చూపు మెరుగుపరచడంలో దోహదం చేస్తాయి.

image:Pixabay

బాదంపప్పులో క్యాల్షియంతో పాటు విటమిన్‌ ఇ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఇది ఎముకల పటుత్వానికే కాదు.. చర్మం ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది.

image:Pixabay 

బాదంలను పొట్టు తీయకుండా తింటేనే మంచిది. ఎందుకంటే గుండెను కాపాడే ఫ్లావనాయిడ్లు ఈ పొట్టులోనే ఉంటాయి.

image:Pixabay

‘మెదడు ఆహారం’గా పేరొందిన అక్రూట్ల(వాల్‌నట్స్‌)లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడు ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తాయి.

image:Pixabay

లివర్‌ కొవ్వుకి ఈ ఆహరపదార్థాలే కారణం!

రెయిన్‌బో డైట్‌ లాభాలివీ..!

రకరకాల పండ్లతో.. అనేక లాభాలు

Eenadu.net Home