ఆరోగ్యానికి అవసరం.. గుబాళించే పరిమళం!
లావెండర్, గులాబీ, కేమోమిలే పరిమళాలు ఒత్తిడితో తలెత్తే దుష్ప్రభావాలను తగ్గిస్తాయి.
Image: Unsplash
లావెండర్ నూనెను నీటిలో కలిపి దిండు మీద చల్లుకుంటే నిద్ర బాగా పడుతుంది.
Image: Unsplash
పచౌలీ పరిమళం బాధను తగ్గించడమే కాదు.. మూడ్‌ను మెరుగుపర్చేందుకు దోహదపడుతుంది.
Image: Unsplash
గులాబీ నూనె చర్మ సమస్యలను దూరం చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపర్చి చర్మం మెరిసేలా చేస్తుంది.
Image: Unsplash
మల్లె, నిమ్మగడ్డి, గులాబీ నూనెలు శరీరంలోని విషతుల్యాలను తొలగిస్తాయట. వైద్యుల సలహా మేరకు కొద్దిగా టీలో కలుపుకొని తాగొచ్చు.
Image: Unsplash
యూకలిప్టస్ నూనెను వేడి నీటిలో కలిపి ఆవిరి పడితే జలుబు తగ్గుతుంది. తులసి ఆకులతో ఆవిరి పట్టినా జలుబు నయమవుతుంది.
Image: Unsplash
నీటిలో కాస్త లావెండర్ లేదా జెరీనియం నూనె కలిపి.. అందులో చిన్న రుమాలును తడిపి తల, మెడ మీద వేసుకుంటే నొప్పి తగ్గుతుంది.
Image: Unsplash
నిమ్మగడ్డి, బార్గమోట్, సైప్రస్, రోజ్‌మేరీ నూనె పరిమళాలు కుంగుబాటు తగ్గేలా చేస్తాయి.
Image: Unsplash
కెమోమిలే, జెరీనియం, మల్లె, లావెండర్, నరోలీ, పచోలీ పరిమళాలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.
Image: Unsplash
నెరోలీ నూనెతో తల మర్దన చేసుకున్నా, నీటిలో కలిపి స్నానం చేసినా ఒళ్లు నొప్పులు, ఆందోళన తగ్గే అవకాశముంది.
Image: Unsplash