దానిమ్మ పండుతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో!
దానిమ్మలో పొటాషియం, క్యాల్షియం లాంటి ఖనిజాలతోపాటు పీచూ తగినంత మొత్తంలో ఉంటుంది. అలాగే విటమిన్-సి, కె, బి, ఎ పుష్కలంగా ఉంటాయి.
Source:Pixabay
దానిమ్మ రసంలో కొవ్వును కరిగించే ప్యూనిక్ కొల్లాజెన్, ప్యూనిక్ యాసిడ్ ఉంటాయి. ఈ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే కొవ్వు కరుగుతుంది.
Source:Pixabay
అనార్‌గా పిలిచే ఈ పండు దంత సమస్యలకు చెక్ పెడుతుంది. చిగుళ్లవాపును తగ్గిస్తుంది.
Source:Pixabay
ఈ పండులోని విటమిన్ కె రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి సాయపడుతుంది. దీంట్లో ఇనుము ఎక్కువ. కాబట్టి తరచూ తీసుకుంటే రక్తహీనత సమస్య ఉత్పన్నం కాదు.
Source:Pixabay
దానిమ్మ గింజల్లోని నూనె చర్మం పైపొరను (ఎపిడెర్మిస్) బలోపేతం చేస్తుంది. ఫలితంగా ముడతలు పడటమూ తగ్గుతుంది.
Source:Pixabay
అజీర్తి, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, వాంతులు.. లాంటి ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఆందోళనను తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
Source:Pixabay
దీన్ని తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎముక సాంద్రత కూడా అధికమవుతుంది.
Source:Pixabay
ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరంలో అంతర్గత అవయవాల్లోని వాపులను తగ్గిస్తుంది.
Source:Pixabay
జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుంది.ఆర్థ్రరైటిస్ సమస్యలను ఈ పండు అడ్డుకుంటుంది.
Source:Pixabay
దీన్ని జ్యూస్‌గా కంటే నేరుగా గింజల రూపంలో తీసుకుంటేనే ఎక్కువ ప్రయోజనం.
Source:Eenadu