మసాలా దినుసుల్లోనూ ఆరోగ్యముంది!

దాల్చిన చెక్క


కణజాలం, న్యూరాన్లు అతిగా పనిచేయకుండా చూస్తుంది. మానసిక ఆందోళనను తగ్గిస్తుంది. తలనొప్పి, నిద్రలేమి, నోటి దుర్వాసనను నివారిస్తుంది.

Image: Unsplash

లవంగాలు


పొట్టలో గ్యాస్‌ను తగ్గిస్తాయి. ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా.. రక్తప్రసరణ సజావుగా జరిగేలా చేస్తాయి. నోటి దుర్వాసనను పోగొడతాయి. కడుపు, గొంతు, పంటి నొప్పులను తగ్గిస్తాయి.

Image: Unsplash

షాజీరా


ఇది కఫాన్ని తగ్గిస్తుంది. చూర్ణాన్ని నస్యంగా పీలిస్తే ముక్కు నుంచి రక్తం పడటం తగ్గుతుంది. అయిదారు చుక్కల వెనిగర్‌లో కలిపి తీసుకుంటే దగ్గు, ఆయాసం తగ్గుతాయి.

Image: Unsplash

బిర్యానీ ఆకు


మాంసాహార వంటకాల్లో ఎక్కువగా వినియోగించే ఈ ఆకుపత్రిని జలుబు, దగ్గు, ఆయాసం తగ్గించే ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడుతుంటారు. కషాయంగా తీసుకుంటే గ్యాస్‌ సమస్య తగ్గుతుంది.

Image: Unsplash

అల్లం.. వెల్లులి


ఈ రెండింటిలోని సుగంధ తైలాలు ఆహారం త్వరగా చెడిపోకుండా చూడటమే కాదు.. రుచిని, సువాసనను అందిస్తాయి. తిన్న ఆహారం త్వరగా అరిగేలా.. శరీరంలో రక్త ప్రసరణ వేగవంతం అయ్యేలా చేస్తాయి.

Image: Unsplash

జాజికాయ 


జాజికాయ పొడిని పెరుగులో వేసి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. పాలల్లో కలిపి తాగితే నిద్ర బాగా పడుతుంది.

Image: Pixabay

యాలకులు


కడుపులో తిప్పినప్పుడు, వాంతులు అరికట్టడానికి, పొట్టలో గ్యాస్‌, చెడు బ్యాక్టీరియా పెరగకుండా ఉండటానికీ ఇవి సహాయపడతాయి. నోటి దుర్వాసనను తగ్గిస్తాయి.

Image: Unsplash

జీలకర్ర


అజీర్ణంతో వచ్చే ఇబ్బందులకు మంచి ఔషధం. లాలాజల గ్రంథుల్ని క్రియాశీలం చేస్తుంది. శ్వాసక్రియ వ్యవస్థను కాపాడుతుంది.

Image: Unsplash

ఆవాలు


గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులను తగ్గిస్తాయి. శ్వాస ఇబ్బందుల్ని తొలగిస్తాయి.

Image: Unsplash

మిరియాలు


ఇవి కఫాన్ని కరిగిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరంలో కొవ్వు పేరుకోకుండా చేస్తాయి. కండరాల నొప్పిని తగ్గిస్తాయి. వీటితో తలనొప్పి తగ్గుతుంది.

Image: Unsplash

గమనిక: మసాలా దినుసులను చాలా తక్కువగా వాడుకోవాలి. ఎక్కువైతే మలబద్ధకం, కడుపులో మంట, అజీర్ణం లాంటి సమస్యలూ వస్తాయి.

Image: Unsplash

అవిసెలతో అనేక లాభాలు

ఇమ్యూనిటీని పెంచే డ్రింకులివి!

పదే పదే తీపి తినాలనిపిస్తుందా..!

Eenadu.net Home