పాలకూర ప్రయోజనాలు తెలుసా?
పాలకూర చిన్న వయసులోనే ముఖంపై వచ్చే ముడతలను తొలగిస్తుంది. అంతేకాకుండా యవ్వనంగా ఉంచుతుంది.
image:unsplash
శరీరంలో నరాల వ్యవస్థపై పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి.
image:unsplash
ఈ ఆకు కూరలో తక్కువ కెలొరీలు ఉండటం వల్ల వేగంగా బరువు తగ్గేందుకూ సహాయపడుతుంది.
image:unsplash
ఇందులో విటమిన్ ఎ, బి, సి, కె, జింక్, మెగ్నీషియం తోపాటుగా ఐరన్ శాతం కూడా ఎక్కువే. ఇది రక్తహీనత రాకుండా చూస్తుంది.
image:unsplash
పాలకూరలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు కంటి సమస్యలనూ దూరం చేస్తాయి.
image:unsplash
ఆర్థరైటిస్, ఆస్తమా, మైగ్రేన్ వంటి ఇబ్బందుల నుంచి ఇది మనల్ని సంరక్షిస్తుంది.
image:unsplash
అధిక రక్తపోటు, ఒత్తిడి, భావోద్వేగాలనూ అదుపులో ఉంచుతుంది.
image:unsplash
తగిన మోతాదులో ఈ ఆకుకూరని తీసుకుంటే శరీరంలో సోడియం - పొటాషియాన్ని సమతుల్యం చేసేందుకూ సహాయపడుతుంది.
image:unsplash
అధిక మొత్తంలో కాల్షియం ఉండటంతో ఎముకలు బలంగా తయారవడానికి ఇది తోడ్పడుతుంది.
image:unsplash
దీంట్లో ఎన్ని ప్రయోజనాలున్నా మోతాదుకు మించి తీసుకుంటే కిడ్నీ సమస్యలు తప్పవని గుర్తుంచుకోండి.
image:unsplash