కలబందతో అందం.. ఆరోగ్యం

మనకు విరివిగా దొరికే కలబందలో శరీరానికి అవసరమైన పోషకాలన్నీ ఉన్నాయి. దీనిలో ఎ, బి, సి, ఇ విటమిన్లతోపాటు 18 రకాల అమైనో ఆసిడ్లుంటాయి. ఇవి శరీరంలోని మలినాలను తొలగించి, మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది.

Image:Eenadu

ఎసిడిటీ, గ్యాస్‌, కడుపుబ్బరం వంటి సమస్యలకు కలబందతో చెక్‌ పెట్టొచ్చు. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడమేకాక మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

Image:Eenadu

ఇది చర్మాన్ని మృదువుగా తాజాగా చేయడంతోపాటు మెరుపునూ అందిస్తుంది. కురులను బలంగా మార్చి మృదుత్వాన్ని ఇస్తుంది.

Image:Eenadu

దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. రోజూ ఉదయాన్నే ఉసిరి, తులసితో కలిపి తీసుకుంటే శరీరం లోపలి నుంచి క్లెన్సింగ్‌ అవుతుంది.

Image:Eenadu

దీన్ని నేరుగా తీసుకోవడం నచ్చకపోతే... కప్పు కలబంద గుజ్జుకు టేబుల్‌ స్పూను చొప్పున నిమ్మరసం, బెల్లం, గ్లాసు నీరు కలిపి మిక్సీ పట్టి పరగడుపున తాగితే సరి. కావాలనుకుంటే తేనెను కలుపుకోవచ్చు.

Image:Eenadu

మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నవారు కలబంద రసాన్ని తాగడం వల్ల ఆ సమస్యకు స్వస్తి పలకవచ్చు. ఈ మొక్క బయటి భాగంలో ఉండే ఆంత్రాక్వినోన్స్‌ సమ్మేళనాలు మలబద్ధకానికి ప్రకృతి ఔషధంగా ఉపయోగపడతాయి.

Image:Eenadu

హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో, రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలోనూ కలబంద రసం ఉపయుక్తంగా ఉంటుంది.

Image:Eenadu

కలబంద రసం కడుపు పూతల సంభవనీయతను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచి, అదనపు శక్తిని చేకూర్చుతుంది. ఈ రసంలో ఉండే విటమిన్‌ సి వంటి అనేక రోగనిరోధక సమ్మేళనాలు జీర్ణక్రియను సక్రమంగా చేయడానికి సహాయపడతాయి.

Image:Eenadu

హైపోథైరాయిడిజమ్‌... ముందే గుర్తిస్తే నయం!

చలికాలంలో చిన్నారుల సంరక్షణ!

శరీరానికి ఉపకారం చేసే ఉపవాసం

Eenadu.net Home