ఆపిల్ పండు.. పోషకాలు మెండు 

మన శరీరానికి కావవలసిన పోషక పదార్థాలు ఆపిల్ పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. అందుకే అనారోగ్యం బారినపడినప్పుడు వీటిని తినాలి వైద్యులు సూచిస్తారు.

Image:Pixabay

 ఈ పండ్లు తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుముఖం పడతాయి. వీటిలో ఫ్లెవనాయిడ్లు, పీచు అధికంగా ఉంటాయి. 

Image:Pixabay

అధిక బరువు తగ్గేందుకు, గుండె ఆరోగ్యానికి యాపిల్స్‌ మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫైబర్‌, విటమిన్‌ సి, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఫొలేట్, బీటా కెరోటీన్‌, విటమిన్‌ కె

తదితర పోషకాలు మన శరీరానికి సంపూర్ణ పోషణను అందిస్తాయి.

Image:Pixabay

దంతాలు, ఎముకల ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్‌ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది.

Image:Pixabay

ఆపిల్ గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. లివర్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Image:Pixabay 

ఈ పండులో ఎక్కువగా ఐరన్‌, ఫాస్పరస్‌ ఉంటాయి. కాబట్టి రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారు వీటిని తరచూ తినాలి.

Image:Pixabay

గ్రీన్‌ ఆపిల్‌ వల్ల చర్మ క్యాన్సర్‌లను నివారించడమే కాకుండా మతిమరుపును కూడా తగ్గిస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. కిడ్నీలు రాళ్లు ఏర్పడినప్పుడు ఆపిల్స్‌ను తినడం వల్ల ఫలితం ఉంటుంది.

Image:Pixabay

జీర్ణాశయంలో ఉండే మంచి బ్యాక్టీరియాకు ఆపిల్ పండు ఎంతగానో మేలుచేస్తాయి. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది.

Image:Pixabay

 ప్రతి రోజూ ఆపిల్‌ తినడం వల్ల కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. ఊబకాయం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, ఆస్తమా, నిద్రలేమి సమస్యలకు ఆపిల్ చెక్‌ పెడుతుంది.

Image:Pixabay

లివర్‌ కొవ్వుకి ఈ ఆహరపదార్థాలే కారణం!

రెయిన్‌బో డైట్‌ లాభాలివీ..!

రకరకాల పండ్లతో.. అనేక లాభాలు

Eenadu.net Home