బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే బీట్‌రూట్ తినండి!
బీట్‌రూట్‌లో నైట్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎక్కువ సమయం పాటు శక్తినిస్తాయి. కాబట్టి రోజూ ఓ గ్లాసు బీట్‌రూట్ జ్యూస్ తాగితే మంచిది.
Image:Eenadu
ఈ దుంపలో ఐరన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది రక్తహీనత రాకుండా చూస్తుంది.
Image:Pixabay
దీంట్లో క్యాల్షియం, ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి ఇవి తోడ్పడతాయి.
Image:Pixabay
బీట్‌రూట్ రసం చక్కటి డిటాక్స్‌లా పనిచేస్తుంది. కడుపులోని ఆమ్లాలను క్రమబద్దీకరించి జీర్ణక్రియ సాఫీగా సాగేలా చూస్తుంది.
Image:Eenadu
ఇందులో ఉండే బి, సి విటమిన్‌లు ఆరోగ్యంతోపాటు అందాన్ని కాపాడతాయి. బీట్‌రూట్ రసం నుంచి అందే కెలొరీలు తక్కువ, కొవ్వు అస్సలు ఉండదు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తినొచ్చు.
Image:Eenadu
బీట్‌రూట్‌లో ఆల్ఫా లినోయిక్ ఆమ్లం అనే యాంటీ ఆక్సిడెంట్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌పై ప్రభావం చూపి.. వృద్ధాప్య ఛాయలు రానివ్వకుండా చేస్తుంది.
Image:Pixabay
చర్మం పగిలి దద్దుర్లు వచ్చిన చోట దీని రసాన్ని పూస్తే ఫలితం ఉంటుంది. మొటిమల నివారణకు కూడా ఇది మంచి మందు.
Image:Eenadu
దీనిలోని ఇనుము, ఎలక్ట్రోలైట్స్, పొటాషియం జుట్టు నిర్జీవంగా తయారవకుండా చూస్తాయి.
Image:Eenadu
ఈ దుంపలో అధిక మోతాదులో ఉండే నైట్రేట్‌లు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి ఎక్కువ ఆక్సిజన్ తీసుకొనేలా చేస్తాయి.
Image:Pixabay