కాకర.. ఆరోగ్యానికి ఆసరా
పొట్టకు సంబంధించిన అనేక సమస్యలకు ఇందులోని చేదు గుణం మందులా పనిచేస్తుంది.
image:Pixabay
కప్పు తాజా కాకర ముక్కల నుంచి రోజువారీ అవసరమయ్యే సి-విటమిన్‌లో 93 శాతం లభిస్తుంది.
image:Pixabay
కాకర కాయలు, గింజల్లో ఉండే ఎమ్‌ఆర్‌కె-29 అనే ప్రొటీన్ రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది.
image:Pixabay
రోజూ రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున తాజా కాకరకాయ రసాన్ని తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. ఇది రక్తశుద్ధికీ తోడ్పడుతుంది.
image:Pixabay
కాకరలోని పీచువల్ల జీర్ణశక్తి బాగుంటుంది. నులిపురుగులు, కాలేయ సమస్యలు, చర్మ వ్యాధులను అరికట్టడంలో సహాయపడుతుంది.
image:Pixabay
కీళ్లనొప్పులకీ కాకరకాయ ఔషధగుళికే. ఇందులో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తప్రసరణకు తోడ్పడతాయి. దాంతో జుట్టు, చర్మం కూడా మెరుపుని సంతరించుకుంటాయి.
image:Pixabay
ఊబకాయం, మూత్ర వ్యాధులతో బాధపడేవాళ్లు తరచూ కాకరకాయ తింటే ఫలితం ఉంటుంది.
image:Pixabay
ఆస్తమాతోపాటు దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యల్ని ఇది తగ్గిస్తుంది. రింగ్‌వార్మ్, సోరియాసిన్, దురద వంటి వ్యాధులతో బాధపడేవారు కాకరకాయ రసం తాగితే ఫలితం ఉంటుంది.
image:Pixabay