పాప్‌కార్న్‌ తింటే ఇన్ని లాభాలా? 

మొక్కజొన్నల నుంచి తయారయ్యే ఈ పాప్‌కార్న్‌లో ఉండే పీచు, పాలిఫినోలిక్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి కాంప్లెక్స్, మాంగనీస్, మెగ్నీషియం.. మొదలైనవన్నీ ఆరోగ్యానికి ఉపకరిస్తాయి.



image:pixabay

ఇందులో ఉండే పీచు పదార్థాలు రక్తనాళాలు, ధమనుల గోడల్లో పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తాయి.

image:pixabay 

పాప్‌కార్న్‌లో ఉండే మాంగనీస్ మన శరీరంలో ఎముకల ఎదుగుదలకు దోహదపడటమే కాదు.. వాటి ఆరోగ్యాన్ని సంరక్షించడంలోనూ చక్కగా ఉపయోగపడుతుంది.

image:pixabay

పాప్‌కార్న్‌లో ఉండే ఫ్రీ రాడికల్స్ వయసు పెరిగే కొద్దీ తలెత్తే సమస్యలను దరిచేరకుండా చూస్తాయి.

image:pixabay 

ముఖ్యంగా ముడతలు, దృష్టి లోపం, కండరాల బలహీనత, ఆస్టియోపొరోసిస్, అల్జిమర్స్, జుట్టు రాలిపోవడం.. మొదలైన సమస్యలకు ఇది చక్కని పరిష్కారంగా నిలుస్తుంది.


image:pixabay

28 గ్రాముల పాప్‌కార్న్‌లో 0.9 మిల్లీ గ్రాముల ఐరన్‌ ఉంటుంది. దీన్ని రోజూ స్నాక్స్‌గా తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమయ్యే ఐరన్‌ను సులభంగా పొందవచ్చు.

image:pixabay

వీటిలో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు.. కాబట్టి బరువు పెరుగుతామనే భయం ఉండదు.

image:pixabay

ఇందులో ఎక్కువ మొత్తంలో ఉండే పీచు పదార్థాలు కడుపు నిండుగా అనిపించేలా చేయడమే కాకుండా ఆకలికి కారణమయ్యే గ్రెలిన్ అనే హార్మోన్‌ని ఉత్పత్తి కాకుండా ఆపుతాయి.

image:pixabay

జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేసేలా చేసి మలబద్ధకం వంటి సమస్యలను దరిచేరనివ్వవు.

image:pixabay

పాప్‌కార్న్ తినేవారితో పోలిస్తే తినని వారిలో మధుమేహంతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందట!

image:pixabay

ఎందుకొచ్చిందీ తలనొప్పి?

వరల్డ్‌ లివర్‌ డే...

కొలెస్ట్రాల్‌ ఎక్కువైతే ఇవి తప్పవు

Eenadu.net Home