నెయ్యి.. పోషకాల గని

ఇందులోని ఎ, ఇ, డి, కె విటమిన్లు, ఒమేగా-3, ఒమేగా-6 వంటి ఫ్యాటీ ఆమ్లాలు, లినోలిక్, బ్యుటిరిక్ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు.. మొదలైన పోషకాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే.


#Pixabay

నెయ్యిలో ఎక్కువ మొత్తంలో ఉండే ఈ ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని నరాల పనితీరును మెరుగుపరిచి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. తద్వారా మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది.

#SocialMedia

జీర్ణవ్యవస్థలో కొన్ని రకాల ఆమ్లాలు విడుదలయ్యేలా చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు దోహదం చేస్తుంది.

#Pixabay

ఇందులో అధిక మొత్తంలో ఉండే కాంజ్యుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్ఏ).. అనే ఫ్యాటీ ఆమ్లం క్యాన్సర్ కారకాలైన కార్సినోజెన్లను తగ్గిస్తుంది. అలాగే ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా కూడా రక్షిస్తుంది.


#SocialMedia

నెయ్యి కేవలం ఆరోగ్యానికే కాదు.. అందానికీ మేలు చేస్తుంది. ఇది సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

#SocialMedia

ఈ పదార్థంలో ఉండే యాంటీవైరల్, యాంటీఫంగల్ గుణాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాదు.. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి కూడా నెయ్యి దివ్యౌషధం.


#Pixabay

శరీరానికి తక్షణ శక్తిని అందించడానికైనా, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికైనా, చర్మంపై ఏర్పడే అలర్జీలను తగ్గించడానికైనా నెయ్యి బాగా ఉపయోగపడుతుంది.

#SocialMedia

నెయ్యిని ఆరు నెలల పాటు తక్కువ మోతాదులో రోజూ తీసుకోవడం వల్ల బరువు అదుపులోకి వస్తుందని ఓ అధ్యయనంలో కూడా వెల్లడైంది.


#Pixabay

నెయ్యి ఆరోగ్యానికి మంచిదన్నారు కదా.. అని మరీ ఎక్కువగా తీసుకుంటే లేనిపోని అనారోగ్యాల్ని కొనితెచ్చుకున్నవారవుతారు. కాబట్టి రోజుకు రెండు టీస్పూన్ల నెయ్యిని ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం.

#SocialMedia 

అవిసెలతో అనేక లాభాలు

ఇమ్యూనిటీని పెంచే డ్రింకులివి!

పదే పదే తీపి తినాలనిపిస్తుందా..!

Eenadu.net Home