మఖానాతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!

తామర గింజలనే ‘మఖానా’ అంటారు. వీటిని ఫాక్స్ నట్స్‌ అని కూడా పిలుస్తారు. గ్లూటెన్‌ ఫ్రీతో పాటు ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉన్న ఈ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు చెబుతారు.

image:SocialMedia 

వీటిని కొందరు పచ్చిగానే ఉపయోగిస్తే... మరికొందరు వేయించుకుని, ఉడకబెట్టుకుని కూరల్లో, స్వీట్లలో వినియోగిస్తుంటారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో వీటితో మిఠాయిలు చేసి దేవునికి నైవేద్యం పెడతారు.

image:SocialMedia 

తక్కువ కెలొరీలున్న మఖానాను డైట్‌లో చేర్చుకోవడం వల్ల అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.

image:SocialMedia 

మఖానాలో సోడియం తక్కువ, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువ మోతాదులో ఉంటాయి. బీపీ రోగులు వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

image:SocialMedia 

వీటిలోని ప్రొటీన్‌ బరువు తగ్గించడంలో సహాయపడితే... ఫైబర్‌ ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తుంది.

image:SocialMedia 

తామర గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్‌, డయాబెటిస్‌, ఆర్థరైటిస్‌ సమస్యలను నిరోధిస్తాయి.

image:SocialMedia 

గ్లైసెమిక్‌ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఈ గింజలు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. ఇందులోని మెగ్నీషియం నరాల పనితీరును మెరుగుపరుస్తుంది.

image:SocialMedia 

కీళ్ల సమస్యలతో పాటు దంత సమస్యలతో బాధపడేవారు ఈ గింజలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలోని క్యాల్షియం, మెగ్నీషియం ఎముకలు, దంతాలను బలంగా మారుస్తాయి.

image:SocialMedia 

ఫైబర్‌ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మఖానాతో చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మొటిమలు, ముడతలు రాకుండా ఉంటాయి.

image:SocialMedia 

తీపి తినాలన్న కోరిక ఇందుకేనట..!

డీ హైడ్రేషన్‌ను నివారిద్దాం..

పరగడుపున టీ తాగితే ఈ సమస్యలు తప్పవు!

Eenadu.net Home