పెరుగుతో ఆరోగ్యం మెరుగు

ప్రతిరోజూ పెరుగు తీసుకునే వారిలో గుండె సంబంధిత సమస్యలు చాలామటుకు అదుపులో ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు కూడా అదుపులోకి వస్తుంది.

image:Eenadu

కొన్ని సందర్భాల్లో చాలా ఒత్తిడిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కప్పు పెరుగు తిని చూడండి. అది ఒత్తిడిని సులువుగా తగ్గించేస్తుంది. అలాగే బరువు సైతం అదుపులో ఉంటుంది.

image:Eenadu

ఇతర పాల పదార్థాల్లానే పెరుగులోనూ క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలకు, దంతాలకు మేలు చేస్తుంది.

image:Eenadu

రోజూ పెరుగు తినడం వల్ల భవిష్యత్తులో కీళ్లనొప్పులు, ఆస్టియోపొరోసిస్‌ లాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉంటాయి.

image:Eenadu

శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా పెరుగులో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యాన్ని అందిస్తుంది.

image:SocialMedia

ప్రతిరోజూ పెరుగు తీసుకునే మహిళల్లో వెజైనల్‌ ఈస్ట్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.

image:SocialMedia

జీర్ణవ్యవస్థ పనితీరు బాగుండాలంటే ప్రతిరోజూ పెరుగు తీసుకోవాలి. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల పొట్టలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

image:SocialMedia

కొందరికి తరచూ ఛాతీలో మంట వేధిస్తుంటుంది. దీనికి కారణం జీర్ణాశయంలోని రసాలు గొంతులోకి ఎగదన్నుకు రావటం. ఇలాంటివారు రోజూ పరగడుపున రెండు చెంచాల పెరుగు తింటే ఛాతీలో మంట తగ్గటానికి తోడ్పడుతుంది.

image:SocialMedia 

వరల్డ్‌ లివర్‌ డే...

కొలెస్ట్రాల్‌ ఎక్కువైతే ఇవి తప్పవు

చెరకు రసం ప్రయోజనాలేంటో తెలుసా?

Eenadu.net Home