పచ్చి కొబ్బరితో ఆరోగ్య ప్రయోజనాలు

పచ్చి కొబ్బరిలో పిండిపదార్థం తక్కువగా, పీచు ఎక్కువగా ఉంటుంది. దాంతో రక్తంలో చక్కెరస్థాయులు నిలకడగా ఉంటాయి. కాబట్టి దీన్ని తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.

Image:Pixabay

దీన్ని తినడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు, మహిళలు... అందరూ తినొచ్చు.

Image:Eenadu

100 గ్రాముల పచ్చికొబ్బరి తింటే 354 కెలొరీల శక్తి లభిస్తుంది. పిండిపదార్థాలు 15 గ్రాములు, కొవ్వులు 33 గ్రాములు, పీచు 10 గ్రాములు అందుతాయి.

Image:Pixabay

దీంట్లో పీచు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌, కాపర్‌ లాంటి ఖనిజాలు దండిగా ఉంటాయి.

Image:Pixabay

 ఇందులోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు.. కణాలు ఆక్సిడేటివ్‌ ప్రభావానికి గురికాకుండా చూస్తాయి. అంటే వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయన్నమాట.

Image:Pixabay 

కొబ్బరి పచ్చడిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అజీర్తి, డయేరియా, మలబద్ధకం తదితర సమస్యలు తగ్గిపోతాయి.

Image:Eenadu

కొబ్బరిని తినడం వల్ల రోగనిరోధకత పెరుగుతుంది. దీంట్లో యాంటీవైరల్‌, యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీ పారాసైటిక్‌ సమ్మేళనాలుంటాయి. ఇవి శరీరానికి హాని చేసే అన్ని రకాల సూక్ష్మజీవులను చంపేస్తాయి.

Image:Pixabay

హృదయ సంబంధ సమస్యలను తగ్గించి, రక్తపోటును నియంత్రిస్తుంది. అల్జీమర్స్‌ రాకుండా అడ్డుకుని జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మూత్ర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది.

Image:Pixabay

తీపి తినాలన్న కోరిక ఇందుకేనట..!

డీ హైడ్రేషన్‌ను నివారిద్దాం..

పరగడుపున టీ తాగితే ఈ సమస్యలు తప్పవు!

Eenadu.net Home