అల్ల నేరేడు పండు.. ప్రయోజనాలు మెండు..

నల్లగా నిగనిగలాడే ఈ పండులో అధిక మోతాదులో సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్‌, మాంగనీస్‌, జింకు, ఐరన్‌, విటమిన్‌ సి, రెబోఫ్లేవిన్‌, కోలైన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. Source:Pixabay  

ఈ పోషకాలు మనలో వ్యాధి నిరోధకతను పెంచడంతోపాటు రక్త హీనతను తగ్గిస్తాయి. వీటిలో గుండె, క్యాన్సర్‌ ముప్పును తగ్గించే గుణాలున్నాయి.

Source:SocialMedia

నేరేడు పండు గింజలను ఎండబెట్టుకొని పొడి చేసి రోజూ గ్లాసు నీటిలో కలుపుకొని తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

Source:SocialMedia

జ్వరంగా ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలుపుకొని తాగితే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.

Source:SocialMedia

మూత్రంలో మంట తగ్గడానికి నిమ్మ, నేరేడు పండు రసం రెండు చెంచాలు నీళ్లలో కలుపుకొని తాగాలి.

Source:SocialMedia

ఈ పండు జీర్ణశక్తిని పెంచడంతో పాటు గ్యాస్‌ లాంటి సమస్యలకు చక్కని పరిష్కారం చూపుతుంది.

Source:SocialMedia

జిగట విరేచనాలతో బాధ పడేవారు రెండు, మూడు చెంచాల నేరేడు పండ్ల రసాన్ని తాగితే విరేచనాలు తగ్గుతాయి.

Source:SocialMedia

మహిళలకు రుతుస్రావం అధికంగా అయితే నేరేడు గింజల పొడిని కషాయంగా చేసుకొని చెంచాడు తాగితే మంచి ఫలితం ఇస్తుంది.

Source:SocialMedia

నోటి పూత, చిగుళ్ల వ్యాధులు దంతక్షయం ఉన్నవారు నేరేడు ఆకుల రసాన్ని రోజూ పుక్కిలిస్తే, మంచి ఫలితం ఉంటుంది.

Source:SocialMedia

నేరేడు పండులో యాస్ట్రిజెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మచ్చలు, మొటిమలు, ముడతల నుంచి రక్షిస్తాయి.

Source:SocialMedia

తీపి ఎక్కువ తింటే ఈ సమస్యలు ఖాయం!

గంజి తాగితే గంపెడు లాభాలు..

అకస్మాత్తుగా పెరిగే బరువుకు కారణాలివే!

Eenadu.net Home