ఉల్లి.. పోషకాల తల్లి
ఉల్లిపాయలో 89శాతం నీరు, 9శాతం పిండిపదార్థాలు, ఒక శాతం ప్రొటీన్ ఉంటాయి. పొటాషియం, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్... వంటి ఖనిజాలూ; ఫొలేట్, విటమిన్-సి, ఎ, బి6లతోపాటు పీచూ పుష్కలంగా లభిస్తాయి.
Image:Pixabay
ఉల్లిలోని డై- ట్రై సల్ఫైడ్‌లూ, వినైల్ డైథీన్‌లూ కొవ్వుని కరిగించడంతోపాటు బ్యాక్టీరియా, వైరస్‌లను నివారిస్తాయి. క్వస్టిన్ కణజాల సంరక్షణ, విటమిన్-ఇ ఉత్పత్తి, జ్ఞాపకశక్తి పెరుగుదలకు తోడ్పడుతుంది. రొమ్ము, ఊపిరితిత్తుల వ్యాధులతోనూ పోరాడుతుంది.
Image:Pixabay
ఉల్లిపాయకి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించే గుణం ఉంది. ఇందులోని క్వస్టిన్, సల్ఫర్‌తో కూడిన ఫైటోకెమికల్స్ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా వయసు మీదపడకుండా రక్షిస్తాయి.
Image:Pixabay
ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు హానికర యూవీ కిరణాల్నీ అడ్డుకుంటాయి. ఉల్లిరసంలో కాస్త నిమ్మరసం కలిపి దూదితో మెడకు, ముఖానికి పట్టించి ఆరాక చల్లని నీళ్లతో కడిగేస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
Image:Pixabay
దీనిలోని సల్ఫర్ క్యాటలాజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని పెంచి శిరోజాలను సంరక్షిస్తుంది.
Image:Pixabay
పచ్చి ఉల్లిపాయ చెడు కొవ్వును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీంట్లో ఉండే క్రోమియం రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది.
Image:Pixabay
ఎండు ఉల్లిపాయని రోజూ గ్రా. చొప్పున తీసుకుంటే ఎముకల్లో ఖనిజ సాంద్రత పెరుగుతుంది. గొంతునొప్పి ఉంటే ఉల్లిపాయలో బెల్లం కలిపి తింటే ఉపశమనం కలుగుతుంది.
Image:Pixabay
తెల్ల ఉల్లిపాయ ముక్కల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే మూత్రంలో మంట తగ్గడంతోపాటు మూత్రపిండాలూ ఆరోగ్యంగా ఉంటాయి. కలరా వ్యాధితో బాధపడే రోగికి ఉల్లిరసాన్ని తరచూ పట్టిస్తే మంచిదట. పచ్చి ఉల్లిపాయని తింటే నెలసరి సమస్యలూ తగ్గుతాయి.
Image:Pixabay
ఉల్లిపాయలో ఉండే ఫోలేట్ నిద్రపట్టేలా, ఆకలి వేసేలా చేస్తుంది. కుంగుబాటు తగ్గడానికీ తోడ్పడుతుంది.
Image:Pixabay
ఉల్లి కాడల్లోని క్యామెఫెరాల్ అనే ఫ్లేవనాయిడ్ రక్తప్రసరణని పెంచుతుంది. గర్భిణులు తొలి మూడు నెలల్లో వీటిని తింటే ఫోలిక్‌ఆమ్లం పుష్కలంగా ఉండి శిశువుకి వెన్నెముక సమస్యలూ బుద్ధిమాంద్యం రాకుండా ఉంటాయి.
Image:Pixabay