మైదాతో జాగ్రత్త సుమా!
ఈ రోజుల్లో మైదా పిండి లేని ఆహార పదార్థాలు మార్కెట్లో దొరకడం కష్టమేనండోయ్! రుచిగా ఉండటం వల్ల అందులో ఏం వాడుతున్నారో కూడా గమనించుకోకుండా తినేస్తున్నాం. మైదా ఎక్కువున్న ఆహారంతో ఎన్ని అనర్థాలు ఉన్నాయో తెలుసా..?
image:Pixabay
బిస్కెట్లు, బ్రెడ్డు, పఫ్‌లు, రోల్స్, నూడుల్స్, మంచూరియా ఇలా ఏది చూసినా దాంట్లో మైదానే ఉంటుంది. వాడకం శ్రుతి మించితే అనారోగ్య ప్రమాదాలు తప్పవంటున్నారు నిపుణులు.
image:unsplash
మైదాని ఎక్కువగా తీసుకుంటే మధుమేహం బారిన పడే అవకాశాలున్నాయి. శరీరంలో షుగరు లెవల్స్‌ని మైదా అమాంతంగా పెంచేస్తుంది.
image:unsplash
మైదాలాంటి రిఫైండ్ పిండితో చేసిన పదార్థాలు దీర్ఘకాలిక వ్యాధులకు కారణవుతాయి. దీని వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతినడమే కాక గుండె సంబంధిత జబ్బులు, క్యాన్సర్ తదితర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
image:unsplash
సమోసా, కచోరి వంటి వంటకాల్లో మైదానే ప్రధాన పదార్థం. వర్షాకాలంలోనూ, సాయంత్రం వేళల్లోనూ ఓ కప్పు టీతో పాటుగా ఇలాంటవి లాగించేస్తాం. వీటి వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
image:pixabay
మైదాని ఎక్కువగా తీసుకోవటం వల్ల బరువు పెరుగుతారు. దీంతో ఊబకాయం, రక్తహీనత బారిన పడే అవకాశముంది.
image:rkc
ఆరోగ్యంగా ఉండాలంటే.. మైదా వాడకం తగ్గిస్తే సరి.. దీనికి బదులుగా గోధుమలు, చిరుధాన్యాలతో వంటకాలు చేసుకోవచ్చు.
image:unsplash
మైదాతో చేసిన పదార్థాలు తింటే కలిగే నష్టాల గురించి పిల్లలకు అర్థమయ్యేలా వివరిస్తే.. వాటి జోలికి వెళ్లకుండా ఉంటారు.
image:pixabay
మైదాకు వీలైనంత దూరంగా ఉంటూ.. సమతులాహారం తీసుకుంటూ ప్రతిరోజూ ఒక గంట వ్యాయామం చేస్తే అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
image:unsplash