ఇవి ‘మొబైల్‌’ జబ్బులు


టెక్స్ట్‌ క్లా

గంటల తరబడి ఫోన్‌లో చాటింగ్‌, స్క్రోలింగ్‌ చేయడం వల్ల వేళ్లు వంకర్లు పోతాయి. చేతుల్లో ఉండే కండరాల్లో తీవ్ర నొప్పి ఉంటుంది.

Image: RKC

టెక్‌ నెక్‌

మెడను వంచి మొబైల్‌ను చూడటం వల్ల మెడపై భారం పడి నొప్పి తీవ్రమవుతుంది. దీన్నే టెక్‌ నెక్‌ అని పిలుస్తారు.

Image: RKC

ఫాంటమ్‌ వైబ్రేషన్‌ సిండ్రోమ్‌

కొంత మంది ఫోన్‌ మోగకపోయినా.. కాల్‌, మెసేజ్‌ వచ్చినట్లు, మొబైల్‌ వైబ్రేట్‌ అయినట్లు భ్రమ పడతారు. వెంటనే మొబైల్‌ చెక్‌ చేసుకుంటారు.

Image: RKC

కంప్యూటర్‌ విజన్ సిండ్రోమ్‌

కంప్యూటర్‌/మొబైల్స్‌లో చిన్న సైజ్‌ ఫాంట్‌లో ఉన్నవాటిని తీక్షణంగా చూస్తూ చదవడం.. స్క్రీన్‌పై ఎక్కువసేపు దృష్టి పెట్టడం వల్ల కళ్లు అలసిపోతాయి.. పొడిబారతాయి. దృష్టిలోపం వచ్చే అవకాశముంది.

Image: RKC

నోమో ఫోబియా

మొబైల్‌ ఎక్కడ చేజారిపోతుందోనని కొంత మంది భయపడతారు. పదే పదే ఫోన్‌ను చూసుకుంటారు. ఈ రుగ్మతనే నోమో ఫోబియా అంటారు.

Image: RKC

స్మార్ట్‌ఫోన్‌ పింకీ

చిటికెన వేలుపై మొబైల్‌ పెట్టి బ్రౌజింగ్‌, ఛాటింగ్‌ చేస్తుంటారు. దీంతో మొబైల్‌ బరువంతా పడి ఆ వేలు వంకర పోతుంది.

Image: RKC

సెల్‌ఫోన్‌ ఎల్బో

మొబైల్‌ను ఎక్కువ సేపు పట్టుకొని ఉండటం వల్ల మోచేయిపై ప్రభావం పడి తిమ్మిరి ఎక్కుతుంది. నొప్పి మొదలవుతుంది.

Image: RKC

వీటితోపాటు ఒత్తిడికి గురికావడం, నిద్రలేమి, సైబర్‌నేరాల బారిన పడటం ఇలా ఎన్నో అనర్థాలున్నాయి.

Image: RKC

రక్తహీనతకు అనేక కారణాలు అంటున్నారు వైద్యులు..

ఆరోగ్యాన్ని, ఆయుష్షును అందించే ఆహారం!

లివర్‌ కొవ్వుకి ఈ ఆహరపదార్థాలే కారణం!

Eenadu.net Home