గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి తినండి!

శరీరంలో గుండె ఎంత ముఖ్యమైన భాగమో అందరికీ తెలిసిందే! మరి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Image:Pixabay

 ఓట్స్ తినడం వల్ల బరువు తగ్గడమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే పీచుపదార్థం శరీరంలోని కొవ్వును గ్రహిస్తుంది. దీనివల్ల రక్తంలో కొవ్వు స్థాయి తగ్గి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Image:Pixabay

లైకోపీన్‌ అనే యాంటీఆక్సిడెంట్ ఎక్కువ, క్యాలరీలు తక్కువగా ఉండే టమాటాలు తినాలి. ఇది గుండె చుట్టు పక్కల అనవసర కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది.

Image:Pixabay 

డార్క్‌ చాక్లెట్‌ తినడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలున్నాయి. వాటిలో గుండె ఆరోగ్యం కూడా ఒకటని పలు పరిశోధనల్లో తేలింది. కాబట్టి రోజుకి కనీసం ఒక్క బైట్‌ చొప్పున డార్క్‌ చాక్లెట్‌ తినడం అలవాటు చేసుకోండి.

Image:Pixabay 

 గుండె సురక్షితంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో ఒమేగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండాలి. అవిసె గింజల్లో ఈ పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

Image:Pixabay 

రోజూ కనీసం నాలుగు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం దాదాపు 20 శాతం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

Image:Pixabay

చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి. వారానికి రెండు రోజులు తినొచ్చు. చేపల్లో ఎక్కువగా ఉండే ఒమేగా-3 ప్యాటీ యాసిడ్స్‌ గుండెకు చాలా మేలు చేస్తాయి. రక్తనాళాల్లో పూడికలను నివారించడం, రక్తం పలచ పడేందుకు తోడ్పడుతాయి.

Image:Pixabay

కొవ్వులు తక్కువగా ఉండే వేరుశెనగ, బాదం, పిస్తా.. వంటి నట్స్‌ను రోజూ తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటి నుంచి పీచుపదార్థాలతోపాటు గుండె సంరక్షణకు ఎంతగానో అవసరమైన విటమిన్ 'ఇ' కూడా లభిస్తుంది.

Image:Pixabay

రోజూ కాఫీ తాగడం వల్ల గుండె జబ్బుల బారిన పడే అవకాశం దాదాపు 15శాతం తగ్గుతుంది. అయితే అది కూడా మితంగా రోజుకి ఒకటి లేదా రెండు కప్పులు..!

Image:Pixabay

గుండె ఆరోగ్యానికి యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు, ఒమేగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు చాలా అవసరం. ఇవన్నీ ఒకే ఆహార పదార్థంలో లభించాలంటే ప్రతిరోజూ ఆహారంలో భాగంగా ఆకుకూరలు తీసుకోవడం చాలా ముఖ్యం.

Image:Pixabay

ఆరోగ్యాన్ని, ఆయుష్షును అందించే ఆహారం!

లివర్‌ కొవ్వుకి ఈ ఆహరపదార్థాలే కారణం!

రెయిన్‌బో డైట్‌ లాభాలివీ..!

Eenadu.net Home