ధూం ధామ్‌గా హెబ్బా పటేల్‌!

‘లవ్‌ చెయ్యాలా.. వద్దా..’ అంటూ ‘కుమారి 21F’తో 2015లో తెలుగునాట అడుగుపెట్టింది హెబ్బా పటేల్‌. అప్పట్నుంచీ వరుస చిత్రాలతో అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం‘ధూం ధామ్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. 

నవంబర్‌ 8న విడుదల కానుందీ చిత్రం. సాయి కిషోర్‌ దర్శకుడు. ఇందులో హెబ్బా ఆసక్తికరమైన పాత్ర పోషించింది. 

ఈ ఏడాది ఇప్పటికే.. ‘వెయ్‌ దరువెయ్‌’, ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’తో అలరించింది. తమిళంలో ‘వల్లన్‌’, ‘ఆధ్య’, తెలుగులో ‘ఓదెల 2’ విడుదలకు సిద్ధమవుతున్నాయి.

హెబ్బా ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’కు గుర్తింపు లభించింది. ఆ తర్వాత ‘ద గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌’లోనూ ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.

సినిమాలే కాదు వెబ్‌సిరీస్‌లతోనూ ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకూ ‘మస్తీ’, ‘వ్యవస్థ’ సిరీస్‌లలో నటించింది.

 హెబ్బా పుట్టి పెరిగింది ముంబయిలో. ఈమె కన్నడలో మాట్లాడటం వల్ల ఈమె కన్నడ కుటుంబానికి చెందిందని అనుకుంటారు అందరూ.. 

‘ఖాళీ సమయం దొరికితే చాలు. ట్రిప్‌కి రెడీ అయిపోతాను. అందులోనూ న్యూయార్క్‌ నాకు బాగా నచ్చుతుంది’ అని చెబుతోందీమె.

ఫిట్‌గా ఉండేందుకు కఠినమైన ఆహార నియమాలు పాటిస్తుంది. జిమ్‌లో ఎక్కువ సమయం గడుపుతుంది.

‘రంజాన్ నాకు ఇష్టం. వీధుల్లో షాపింగ్‌ చేస్తూ.. స్నేహితులతో స్ట్రీట్‌ ఫుడ్‌ని ఆస్వాదిస్తాను. ఆహారం విషయంలో పండగలప్పుడు చీట్‌ చేస్తాను’ అని ఓ సందర్భంలో చెప్పింది.   

చీరలు, పరికిణీ ఓణీలు అంటే మహాఇష్టం. సంప్రదాయ లుక్‌లో ఫ్యామిలీ ఫంక్షన్లకు హాజరవుతుంది.

తరచూ ఇన్‌స్టాలో పోస్టులు పెడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈమె ఇన్‌స్టా ఖాతా ఫాలోవర్ల సంఖ్య 18లక్షలకు పైమాటే!

2025.. పాన్‌ ఇండియా ఇయర్‌!

కల్ట్‌ లవ్‌స్టోరీ సీక్వెల్‌లో నెరు నటి

కిస్సిక్‌తో క్రేజ్.. ఎవరీ ఊర్వశి అప్సర

Eenadu.net Home