గూగుల్‌ మ్యాప్సే కాదు.. ఇవీ ఉన్నాయ్‌!

తెలియని ప్రదేశాలకు వెళ్లాలంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది గూగుల్‌ మ్యాప్స్‌. అత్యంత ఆదరణ పొందిన యాప్స్‌లో ఇది ముందు వరుసలో ఉంటుంది.

ఇలా మార్గాలను అన్వేషించడానికి గూగుల్‌ మ్యాప్స్‌ ఒక్కటే కాదు.. ఈ తరహా సేవలందించే మరికొన్ని యాప్స్‌ కూడా ఉన్నాయి. అవేంటంటే..?

Waze

కారు, బైక్‌ యూజర్ల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన నావిగేషన్‌ యాప్‌ ఇది. రూట్‌మ్యాప్‌తో పాటు పోలీసు అలర్ట్‌, ప్రమాద హెచ్చరికలు, ట్రాఫిక్‌ రద్దీ వంటి అప్‌డేట్‌లు ఇస్తుంది. గూగుల్‌ మ్యాప్స్‌ కంటే కాస్త భిన్నంగా ఉంటుంది.

 Sygic

ఆఫ్‌లైన్‌ నావిగేషన్‌ కోసం నిర్దిష్ట ప్రాంతం మ్యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అన్ని దేశాల ఆఫ్‌లైన్‌ 3D మ్యాప్‌లను ఈ సర్వీస్‌ అందిస్తుంది.

Mappls MapmyIndia

అన్ని నావిగేషన్‌ యాప్‌ల కంటే ప్రత్యేకమైన ఫీచర్‌లతో అత్యంత ప్రజాదరణ పొందిందీ Mappls. మ్యాప్‌ మాత్రమే కాకుండా స్పీడ్‌ బ్రేకర్లు, గుంతలు వంటి విషయాల్లోనూ వాహనదారులను అలర్ట్‌ చేస్తుంది.

OsmAnd

వాయిస్‌- గైడెడ్‌ రూట్‌ అసిస్టెన్స్‌ అందిస్తుంది ఈ నావిగేషన్‌ యాప్‌. ఇందులోని కొత్త ఫీచర్లను ఉపయోగించాలంటే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

HereWeGo

గూగుల్‌ మ్యాప్ తరహా ఫీచర్లను అందిస్తూ ఆండ్రాయిడ్‌, ఐఫోన్లలో ఉన్న మరో యాప్‌ ఇది. వివరంగా రియల్‌టైమ్‌ ట్రాఫిక్‌ అప్‌డేట్లను ఇస్తుంది. ఇంటర్‌ఫేస్‌ చాలా సింపుల్‌గా ఉంటుంది.

వీటితో డిజిటల్‌ అరెస్టుకు చెక్‌!

వివో ₹1.60 లక్షల ఫోన్ విశేషాలివీ..

₹25 వేలల్లో 5జీ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

Eenadu.net Home