వాట్సప్‌లో రాబోతున్న టాప్‌ ఫీచర్లివే

యూజర్ల అవసరాలకు అనుగుణంగా వాట్సప్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది.

భవిష్యత్‌లో వాట్సప్‌ యూజర్లను మరిన్ని కొత్త ఫీచర్లు పలకరించబోతున్నాయి.

వాట్సప్‌లో పేమెంట్స్‌ సదుపాయం ఉన్నా.. యూజర్ ఫ్రెండ్లీ లేకపోవడం ఒక సమస్య. దీంతో త్వరలో పేమెంట్‌ ఫీచర్‌ను చాట్‌ మెనూలోకి తీసుకురానున్నారు.

వాట్సప్‌కు మెటా ఏఐను జోడించనున్నారు. దీంతో వాట్సప్‌లోనూ చాట్‌బాట్‌ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. సెర్చ్‌లో మీకు కావాల్సిన సమాధానాలు పొందొచ్చు.

వాట్సప్‌లో ఇతరులతో ఫొటోలు షేర్‌ చేసే ముందు వాటిని మీకు నచ్చినట్లుగా ఏఐ సాయంతో ఎడిట్‌ చేసుకోవచ్చు. బ్యాగ్రౌండ్‌లు మార్చుకోవచ్చు.

గూగుల్‌ క్విక్‌ షేర్‌ తరహాలో వాట్సప్‌లో షేర్‌ ఆప్షన్‌ అందుబాటులోకి రానుంది. దగ్గర్లోని వ్యక్తులతో అధిక సైజ్‌ కలిగిన ఫైల్స్‌ను సులువుగా షేర్‌ చేసుకోవచ్చు.

వాట్సప్‌లో యూజర్‌నేమ్‌ సదుపాయం త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా తరహాలో మీకు నచ్చిన యూజర్‌నేమ్‌ను పెట్టుకోవచ్చు. ఫోన్ నంబర్‌ వెల్లడించాల్సిన అవసరం తప్పుతుంది.

source: @wabetainfo

యూజర్ల భద్రతను మెరుగుపర్చడంలో భాగంగా ప్రొఫైల్‌ పిక్చర్లను స్క్రీన్‌షాట్ తీయకుండా వాట్సప్‌ నిలువరించనుంది. ఎఫ్‌బీలో ఇప్పటికే ఈ భద్రతా ఫీచర్‌ అందుబాటులో ఉంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్లు ట్రై చేశారా?

ఈ దేశాల్లో టిక్‌టాక్‌ నిషేధం!

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

Eenadu.net Home