సైబర్ నేరగాళ్ల నుంచి మీ బ్యాంకు ఖాతాను కాపాడుకోండిలా..
ఇంటర్నెట్ వల్ల బ్యాంకింగ్ సేవలు ఎంత సులువయ్యాయో.. సైబర్ నేరగాళ్ల ఆగడాలూ అదే స్థాయిలో పెరిగాయి.
#pixabay
ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం. కాబట్టి కొన్ని టిప్స్ పాటించాలి.
#pixabay
బ్యాంకు నుంచి అని గానీ, పోలీస్ స్టేషన్ నుంచి అని గానీ ఎవరైనా వ్యక్తి ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు అడిగితే ఇవ్వొద్దు.
#pixabay
క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డు నంబర్, ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ వివరాలు ఆన్‌లైన్‌లో ఎక్కడా స్టోర్ చేయొద్దు.
#pixabay
యూజర్ నేమ్, పాస్‌వర్డ్ వంటి వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. ఇంటర్నెట్ కేఫ్‌ల్లో ఆన్‌లైన్ బ్యాంక్ సేవలను వినియోగించొద్దు.
#pixabay
ఉచితంగా వైఫై లభించే చోట బ్యాంకింగ్ సేవలు వినియోగించడం శ్రేయస్కరం కాదు.
#pixabay
బ్యాంక్ స్టేట్‌మెంట్, మెసేజ్‌లను క్రమం తప్పకుండా చూసుకోవాలి. బ్యాంక్ ఖాతాపై నిఘా ఉంచాలి. అనుమానం ఉంటే వెంటనే బ్యాంకును సంప్రదించాలి.
#pixabay
ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు బలమైన పాస్‌వర్డ్‌లు వినియోగించండి. అన్ని ఖాతాలకూ ఒకే పాస్‌వర్డ్ వాడొద్దు.
#pixabay
బ్యాంకింగ్‌కు సంబంధించి ఎలాంటి మోసాలు జరిగినా వెంటనే బ్యాంకుకు, సైబర్ పోలీసులకు తెలియజేయాలి.
#pixabay