ఫేస్‌బుక్.. 20 ఇయర్స్‌ ఇండస్ట్రీ

సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌ ప్రారంభమై 20 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా కంపెనీ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ నాటి ఫొటోను డీపీగా పెట్టుకున్నారు.

This browser does not support the video element.

ఇన్‌స్టాలోనూ ఓ రీల్‌ పోస్ట్‌ చేశారు. అందులో జుక్‌ తన ప్రయాణాన్ని పంచుకున్నారు.

2004లో ప్రారంభమైన ఫేస్‌బుక్‌.. కేవలం నాలుగేళ్లలోనే తనకు పోటీగా ఉన్న ‘మై స్పేస్‌’ను అధిగమించింది.

2012లో తొలిసారి ఫేస్‌బుక్‌ 100 కోట్ల మంది యూజర్ల మైలురాయిని అందుకుంది. 2023 చివరి నాటికి ఫేస్‌బుక్‌ను రోజూ 200 కోట్ల మంది వినియోగిస్తున్నారు.

మార్క్‌ జుకర్‌బర్గ్‌ కేవలం మెటా సీఈఓనే కాదు.. ప్రపంచ కుబేరుల్లో ఒకరు కూడా. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకారం.. 170.5 బిలియన్‌ డాలర్ల సంపదతో నాలుగో స్థానంలో ఉన్నారు.

ఫేస్‌బుక్‌పై అభియోగాలూ ఉన్నాయి. కేంబ్రిడ్జి అనలటికా కుంభకోణంలో 725 మిలియన్‌ డాలర్లు జరిమానాగా చెల్లించింది.

 2022లో వ్యక్తుల డేటా బయటకు పొక్కడంతో ఫేస్‌బుక్‌ 265 మిలియన్‌ డాలర్ల ఫైన్‌ చెల్లించింది. గతేడాది 1.2 బిలియన్‌ యూరోల ఫైన్‌ పడింది.

ట్విటర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్‌ను తీసుకొచ్చింది. ఐదు రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్‌ రిజిస్టర్డ్‌ యూజర్లను సాధించింది. తర్వాత ప్రాభవం కోల్పోయింది.

మెటా ఇప్పుడు కేవలం సోషల్‌మీడియానే కాదు.. అతిపెద్ద అడ్వర్టైజ్‌మెంట్‌ కంపెనీ కూడా. 2023 చివరి త్రైమాసికంలో ఆ కంపెనీ 40 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా..?

అలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్లాన్లు ఇవే..

Eenadu.net Home