చెన్నై టెస్టు.. అశ్విన్‌ & కో రికార్డులు ఇవే!

బంగ్లాదేశ్‌తో చెన్నైలో జరిగిన తొలి టెస్టులో భారత్‌ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో నమోదైన రికార్డులు ఇవే!

రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ ఐదు వికెట్ల ఫీట్‌ సాధించాడు. దీంతో ఈ ఫార్మాట్‌లో అత్యధిక ఫైఫర్‌ (5 వికెట్లు అంతకుమించి) సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. గతంలో మురళీధరన్‌ (67), షేన్‌ వార్న్‌ (37) ఈ ఫీట్‌ సాధించి ఉన్నారు. 

రిషభ్‌ పంత్‌ ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించి మహేంద్ర సింగ్‌ ధోనీ సరసన చేరాడు. భారత్‌ తరపున అత్యధిక శతకాలు సాధించిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్లు ఇప్పుడు వీరిద్దరే. ఇద్దరూ చెరో ఆరు శతకాలు నమోదు చేశారు. 

మన దేశం తరఫున పెద్ద వయసులో ఐదు వికెట్ల ఫీట్‌ సాధించిన బౌలర్‌గా అశ్విన్‌ (38 ఏళ్ల 2 రోజులు) ఈ మ్యాచ్‌ ద్వారా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు వినూ మన్కడ్‌ (37 ఏళ్ల 306 రోజులు) పేరిట ఉంది. 

ఒకే వేదిక మీద సెంచరీ, ఐదు వికెట్ల ఫీట్‌ చేసిన తొలి ఆటగాడిగా అశ్విన్‌ నిలిచాడు. 2021లోనూ చెపాక్‌ మైదానం అశ్విన్‌ ఇలానే సెంచరీ చేసి, ఐదు వికెట్లుకుపైగా పడగొట్టాడు. 

ఐదు వికెట్ల ఫీట్‌ + సెంచరీ.. ఈ ఘనతను సాధించడం అశ్విన్‌కి ఇది నాలుగోసారి. అతనికంటే ముందు ఇయాన్‌ బోథమ్‌ (5) ఉన్నారు. 

నాలుగో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లకుపైగా తీయడం అశ్విన్‌కి ఇది ఏడోసారి. వార్నర్‌, మురళీధరన్‌ కూడా ఈ ఘనత సాధించి ఉన్నారు. ఈ లిస్ట్‌లో టాప్‌లో రంగన హెరాత్‌ (12) ఉన్నాడు. 

ఈ మ్యాచ్‌లో విజయంతో భారత్‌కు టెస్టుల్లో అపజయాల కంటే జయాలే ఎక్కువ ఉన్నాయి. ఇది భారత్‌కు 179వ విజయం కాగా.. ఇప్పటివరకు 178 సార్లు భారత్‌ ఓడింది.

నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఇండియన్‌ బౌలర్‌గా అశ్విన్‌ (99) నిలిచాడు. ఈ రికార్డు ఇప్పటివరకు కుంబ్లే (94) పేరున ఉంది.

రెజ్లర్‌ టు ఎమ్మెల్యే.. వినేశ్‌ ఓ వారియర్‌!

టెస్టు చరిత్రలో టాప్‌ 10 భారీ ఇన్నింగ్స్‌లు

టెస్టుల్లో 50+ స్కోర్లు.. టాప్‌ 5 ప్లేయర్లు!

Eenadu.net Home