‘సూపర్‌’ టీ20.. నమోదైన రికార్డులివే!

భారత్‌, అఫ్గానిస్థాన్‌ మధ్య బుధవారం జరిగిన మూడో టీ20లో నమోదైన రికార్డులు, ఆసక్తికర గణాంకాలు ఇవే!

#1

అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు సూపర్‌ ఓవర్‌లు జరిగి.. ఫలితం తేలిన ఏకైక మ్యాచ్‌ ఇదే. 

#424 పరుగులు

ఈ మ్యాచ్‌లో నమోదైన మొత్తం పరుగులు. టై అయిన టీ20 మ్యాచుల్లో ఇవి రెండో అత్యధిక పరుగులు.

#5 శతకాలు

టీ20ల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్‌గా రోహిత్‌ నిలిచాడు. ఈ మ్యాచులో 121 పరుగులు చేసి తన శతకాల సంఖ్యను 5కు చేర్చాడు. 

#190 పరుగులు

ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా రోహిత్‌ - రింకు నిలిచారు. ఈ మ్యాచులో అజేయంగా 190 పరుగులు చేశారు. 

#58 పరుగులు

ఆఖరి రెండు ఓవర్లలో భారత్‌ సాధించిన పరుగులు 58. ఒక మ్యాచ్‌లో 19, 20 ఓవర్లలో ఇవే అత్యధిక పరుగులు. గత రికార్డు 55 పరుగులతో నేపాల్‌ పేరిట ఉంది. 

#36 పరుగులు

ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న మూడో బౌలర్‌గా కరీమ్‌ జనత్‌ నిలిచాడు. 20 ఓవర్‌లో టీమ్‌ ఇండియా 36 పరుగులు రాబట్టింది. గతంలో బ్రాడ్‌, అకిల ధనంజయ ఇలా 36 పరుగులు ఇచ్చారు.

#8

190 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీలో రోహిత్‌ ఉండటం ఇది ఎనిమిదోసారి. 

#2

ఐదో వికెట్‌ లేదా ఆ తర్వాతి వికెట్లకు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీల్లో రోహిత్‌ - రింకు 190 పరుగులతో రెండో స్థానంలో నిలిచారు. భారత్ తరఫున అయితే తొలి స్థానం. 

#3

కెప్టెన్‌గా ఉంటూ అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా రోహిత్‌ నిలిచాడు. ఇప్పటికే బాబర్‌ అజామ్‌ కూడా మూడు శతకాలు నమోదు చేశాడు. 

#69 పరుగులు

ఆరో స్థానం లేదంటే ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి అఫ్గాన్‌ మీద అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రింకు నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 69 పరుగులు చేశాడీ బ్యాటర్‌.

#36 సం. 262 రోజులు

టెస్టులు ఆడే దేశాల టీ20ల్లో రికార్డులు చూస్తే... సెంచరీ చేసిన పెద్ద వయస్కుడిగా రోహిత్‌ నిలిచాడు. 36 ఏళ్ల 262 రోజుల వయసులో శతకం సాధించాడు హిట్‌ మ్యాన్‌. 

#5

ఒక మ్యాచులో ఐదు అర్ధ శతకాలు నమోదవ్వడం ఇది రెండోసారి. ఈ మ్యాచులో భారత్‌ తరఫున 2 హాఫ్‌ సెంచరీలు నమోదు కాగా, అఫ్గాన్‌ తరఫున 3 నమోదయ్యాయి. ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్న మ్యాచ్‌ 2019-20లో జరిగిన భారత్‌ vs న్యూజిలాండ్‌ పోరు.

IPL వేలం: ఈ ఏడాది టాపర్‌ పంత్‌.. మరి గతంలో?

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

Eenadu.net Home