₹250 నుంచే సిప్.. వివరాలు ఇవీ..!
అవగాహన లేకుండా స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. అలాంటి వారి కోసమే అందుబాటులోకి వచ్చిందే క్రమానుగత పెట్టుబడి విధానం (SIP).
స్టాక్ మార్కెట్లో పరోక్షంగా పెట్టుబడులు పెట్టి, ప్రతిఫలాలు పొందాలనుకొనే వారి కోసం సిప్ పద్ధతి ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది.
సాధారణంగా రూ.500తో సిప్ చేసే వెసులుబాటు ఉంది. మరింత మందికి చేరువయ్యేందుకు తాజాగా రూ.250కే సిప్‌ను తీసుకొచ్చింది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్.
ఎస్బీఐతో కలిసి ‘జన్ నివేశ్’ పేరిట ఈ సిప్ పథకాన్ని లాంచ్ చేసింది. ప్రస్తుతం ఎస్బీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లో మాత్రమే రూ.250 సిప్ సౌలభ్యం ఉంది.
డీమ్యాట్ ఖాతా లేకుండా ఈ సిప్‌లో పెట్టుబడి చేసే సదుపాయం కల్పించడం విశేషం. ఎస్బీఐ యోనోతో పాటు పేటీఎం, గ్రో, జెరోధా వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ పెట్టుబడులు పెట్టొచ్చు.
సాధారణంగా సిప్ చేసేందుకు ట్రాన్సాక్షన్ ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది.
వ్యక్తుల లక్ష్యాలు, స్థోమతను బట్టి రోజు, వారం, నెలకోసారి చొప్పున సిప్ పద్ధతిలో మదుపు చేయొచ్చు.
మొదటిసారి పెట్టుబడులు పెట్టే మదుపర్లు, తక్కువ మొత్తం పొదుపు చేయగలిగిన వారు, అసంఘటిత రంగ కార్మికులు, గ్రామీణులు ఈ సిప్‌ను ఎంచుకోవచ్చు.
సిప్‌లో పెట్టుబడులు స్టాక్ మార్కెట్ల పనితీరును లోబడి ఉంటాయి. స్వల్పకాలానికి కంటే దీర్ఘకాల లక్ష్యాల కోసం వీటిని పరిశీలించాలని నిపుణులు చెబుతుంటారు.