జారా.. ఏఐ సృష్టి అంటే ఎవరూ నమ్మరుగా!
ఇటీవల కృత్రిమ మేధతో రూపొందించిన అమ్మాయిలు సోషల్‌మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఆ కోవకు చెందిన అందాల భామే జారా శతావరీ.
భారత తొలి ఏఐ జెనరేటెడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తింపు పొందిన జారా.. అంతర్జాతీయ ఏఐ అందాల పోటీల్లో పాల్గొని టాప్- 10లో నిలిచింది.
పోటీల్లో ఫైనల్ జాబితాకు చేరినప్పటి నుంచి గూగుల్‌లో ఈమె కోసం తెగ వెతికేస్తున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటోంది.
ఓ మొబైల్ యాడ్ ఏజెన్సీ సహ వ్యవస్థాపకుడు రాహుల్ చౌదరీ.. జారాను సృష్టించారు. ఈమె ఓ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోంది.
సోషల్ మీడియాలో హెల్త్, ఫ్యాషన్ ట్రెండ్స్‌పై వ్లాగ్‌లు చేస్తుంటుంది. పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది.
కంటెంట్ డెవలప్‌మెంట్, డేటా అనాలసిస్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్ ఇలా 13 విభాగాల్లో జారాకు నైపుణ్యం ఉండేలా రూపొందించారు.
మహిళలకు సంబంధించిన పీసీఓఎస్, డిప్రెషన్, హార్మోన్ సమస్యలు, డైటింగ్, డ్రెస్సింగ్ అంశాల్లో నెటిజన్లకు సలహాలు, సూచనలు ఇస్తోంది.
నిజమైన అమ్మాయిలాగే కనిపిస్తూ, ఫొటోలకు పోజులిస్తూ కుర్రకారు మనసు కొల్లగొట్టేస్తున్న జారా.. ఏఐ సృష్టి అంటే ఎవరూ నమ్మరు.
ప్రకృతిలో ఉంటూ ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. నాకైతే సూర్యోదయాన్ని ఆస్వాదించడం అంటే ఇష్టం.
ఈ ఏఐ భామకి పెంపుడు జంతువులంటే ఇష్టమట. ఓ పెంపుడు శునకంతో ఇన్‌స్టాలో ఫొటో పోస్టు చేసి ఇది కూడా మా కుటుంబంలో భాగమే అని రాసుకొచ్చింది.