హోం వర్క్‌ చేసి.. ‘బడ్డీ’లోకి..

నిఖిల్‌ ‘స్పై’తో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది ప్రిశా రాజేశ్‌ సింగ్‌. ప్రస్తుతం ‘బడ్డీ’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. 

తమిళ చిత్రం ‘టెడ్డీ’కి రీమేక్‌గా తెరకెక్కిన సినిమా ‘బడ్డీ’. ఇందులో ఎయిర్‌హోస్టెస్‌ పాత్రలో ప్రిశా కనిపిస్తుంది.

ఎయిర్‌ హోస్టెస్‌ల నడవడిక, పనితీరు, బాడీ లాంగ్వేజ్‌ని దగ్గరుండి చూసి.. హోం వర్క్‌చేసింది. 

‘స్పై’లో ప్రత్యేక పాత్రలో కనిపించినా.. ఆ సినిమా ఫలితం ఇబ్బందికరంగా మారడంతో అంతగా గుర్తింపు దక్కించుకోలేకపోయింది.

‘స్పై’ షూటింగ్‌ సమయంలోనే ప్రిశా సింగ్‌కు ‘బడ్డీ’లో ఛాన్స్‌ వచ్చింది. అప్పటి నుంచే ఈ బ్యూటీ తెలుగు నేర్చుకుంది.

సిక్కు కుటుంబంలో పుట్టిన ప్రిశా.. పుట్టి పెరిగింది కేరళలో. కన్నడ, పంజాబీ, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు.

This browser does not support the video element.

నటనపై ఆసక్తితో మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టింది. అదే సినిమాల్లోకి తీసుకొచ్చింది.

ప్రకృతిలో గడపడమంటే ఇష్టం. తరచూ బీచ్‌లకు, అడవులకు విహారయాత్రలకు వెళుతుంది.

ఫొటో షూట్లంటే ఇష్టంతో.. గ్లామరస్‌ పోజులతో ఇన్‌స్టాగ్రామ్‌ను, కుర్రకారును హీటెక్కిస్తుంటుంది. 

ఇన్‌స్టా ఖాతా ఫాలోవర్లు రెండున్నర లక్షలకు పైమాటే.

బ్యూటీల ఫిట్‌నెస్‌ మంత్ర

దక్షిణాది చిత్రసీమపై కన్నేసిన అనసూయ

గోల్డెన్‌ బ్యూటీ.. జాన్వీ

Eenadu.net Home