వన్‌ప్లస్‌ 12 సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్లు!

వన్‌ప్లస్‌ మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. వన్‌ప్లస్‌ 12, వన్‌ప్లస్‌ 12R మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. వాటి ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దామా..!

వన్‌ప్లస్‌ 12

ఇందులో 6.82 అంగుళాల 2కే ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లే, 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, స్నాప్‌డ్రాగన్‌ 8జెన్‌ 3 ప్రాసెసర్‌ ఇచ్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది. 

వెనుకవైపు 50+48+64 ఎంపీ కెమెరాలు, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 5,400 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 100 వాట్‌ సూపర్‌వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50వాట్‌ వైర్‌లెస్‌, 10 వాట్‌ రివర్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది. 

12/256 జీబీ వేరియంట్‌ ధర రూ.64,999 కాగా.. 16/512 జీబీ వేరియంట్‌ ధర రూ.69,999గా ఉంది. సిల్కి బ్లాక్‌, ఫ్లోయి ఎమరాల్డ్‌ రంగుల్లో లభ్యమవుతాయి. జనవరి 30 నుంచి విక్రయాలు మొదలవుతాయి. 

వన్‌ప్లస్‌ 12R

దీంట్లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల 1.5కే ఎల్‌టీపీఓ అమోలెడ్‌ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 8జెన్‌ 2 ప్రాసెసర్‌ ఇచ్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తోంది.

వెనుకవైపు 50 ఎంపీ మెయిన్‌ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2 ఎంపీ మాక్రో లెన్స్‌ ఉన్నాయి. 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఇచ్చారు. 5500 ఎంఏహెచ్‌ బ్యాటరీ.. 100 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది.

8/128 జీబీ వేరియంట్‌ ధర రూ.39,999 కాగా.. 16/256 జీబీ వేరియంట్‌ ధర రూ.45,999గా ఉంది. కూల్‌ బ్లూ, ఐరన్‌ గ్రే రంగుల్లో లభ్యమవుతాయి. ఫిబ్రవరి 6 నుంచి మార్కెట్‌లో విక్రయాలు ప్రారంభమవుతాయి.

వన్‌ప్లస్‌ బడ్స్‌ 3

ఫోన్లతోపాటు ఇయర్‌ బడ్స్‌ను తీసుకొచ్చింది. ఇందులోని డ్యుయల్‌ కనెక్షన్‌ మోడ్‌లో రెండు ఫోన్‌లను ఒకేసారి కనెక్ట్‌ చేయొచ్చు. ఒకసారి ఫుల్‌ ఛార్జింగ్‌ పెట్టి 44 గంటలపాటు వినియోగించొచ్చు. ధర రూ.5,499. ఫిబ్రవరి 6 నుంచి అందుబాటులో ఉంటాయి.

అక్టోబర్‌లో రానున్న ఫోన్లు ఇవే..!

లింక్డిన్‌ ప్రొఫైల్‌ ఆకర్షణీయంగా రూపొందించాలా?

శాటిలైట్‌ నావిగేషన్‌ వ్యవస్థలివీ!

Eenadu.net Home