రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొత్త ‘హంటర్‌’.. ఫీచర్లివే!

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న హంటర్‌ 350 వచ్చేసింది. ఈ బైక్‌ ధర తదితర వివరాలు మీకోసం...

Image: Royal Enfield

ఇందులో 349సీసీ, సింగిల్‌ సిలిండర్‌, 4 స్ట్రోక్‌ ఎయిర్‌ ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ సాంకేతిక ఇస్తున్నారు.

Image: Royal Enfield

5 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ ఉంది. 6100 ఆర్‌పీఎంలో 20.2 బీహెచ్‌పీ పవర్‌ ఉంటుంది. అత్యధికంగా 4000 ఆర్‌పీఎంతో 27ఎన్‌ఎం టార్క్‌ ఉంటుంది.

Image: Royal Enfield

ఈ బండి గంటకు గరిష్ఠంగా 114 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. దేశంలో చిన్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బండి ఇదేనట.

Image: Royal Enfield

వీల్‌బేస్‌ 1370 ఎంఎం ఉండగా, రేక్‌ యాంగిల్‌ 25 డిగ్రీలు ఉంటుంది. ఈ బైక్‌ ఫ్యూయల్‌ ట్యాంక్‌ కెపాసిటీ 13 లీటర్లు.

Image: Royal Enfield

బైక్‌లో 17 అంగుళాల కాస్ట్‌ అలోయ్‌ రిమ్స్‌ షాడ్‌ ఉంటుంది. ముందువైపు 110/70-17, వెనుకవైపు 140/70-17 టైర్లు ఉంటాయి.

Image: Royal Enfield

ముందు టైర్‌కి 300ఎంఎం ట్విన్‌ పాట్‌ కాలిపర్‌ డిస్క్‌ బ్రేక్‌ ఇస్తున్నారు. వెనుకవైపు 240 ఎంఎం సింగిల్‌ పిస్టన్‌ బ్రేక్‌ ఉంటుంది. డ్యూయల్‌ ఛానల్‌ యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌) ఉంటుంది.

Image: Royal Enfield

హంటర్‌ 350 రెబల్‌ రెడ్‌, రెబల్‌ బ్లూ, రెబల్‌ బ్లాక్‌, డాపర్‌ గ్రే, డాపర్‌ యాష్‌, డాపర్‌ వైట్‌ రంగుల్లో లభిస్తుంది.

Image: Royal Enfield

రౌండ్‌ హెడ్‌ ల్యాంప్‌, సర్క్యులర్‌ టర్న్‌ ఇండికేటర్స్‌, ఐవీఆర్‌ఎంలు, టెయిల్‌ లైట్లతో ఈ బండి రోడ్‌స్టర్‌ లుక్‌లో కనిపిస్తుంది. టియర్‌ డ్రాప్‌ ఫ్యూయల్‌ ట్యాంక్‌ ఇస్తున్నారు.

Image: Royal Enfield

Image: Royal Enfield

యూపీఐలో ఈ ఏడాది వచ్చిన మార్పులు

వాట్సప్‌ ఈ ఏడాది బెస్ట్‌ ఫీచర్లు ఇవీ..

స్కామర్ల కామన్‌ డైలాగ్స్‌ ఇవీ!

Eenadu.net Home