గిల్‌ రూమర్డ్‌ లవర్‌.. రిధిమా గురించి తెలుసా? 

సోషల్‌ మీడియాలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అంటే.. రిధిమా పండిట్‌. ఈమె గురించి నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. 

క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌, రిధిమా పండిట్‌ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారని, డిసెంబరులో వివాహం చేసుకోనున్నారని వార్తలు హల్‌చల్‌ చేశాయి.

ఎవరో కావాలనే ఇలాంటి తప్పుడు వార్తలు పుట్టిస్తున్నారు.. నాకు గిల్‌తో వ్యక్తిగతంగా ఎలాంటి పరిచయం లేదు అని రిధిమా క్లారిటీ ఇచ్చింది. అయినా ఎవరామె అనే ఉత్సుకత అయితే నెటిజన్లలో కనిపిస్తోంది.

రిధిమా బాలీవుడ్‌ నటి. బుల్లితెరపై సీరియళ్లు, షోస్‌లో నటిస్తోంది. 2021లో బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తర్వాత ఫేమస్‌ అయ్యింది.

ముంబయిలో పుట్టిన రిధిమా సోషియాలజీ, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసింది. మోడల్‌గా కెరీర్‌ను మొదలుపెట్టింది.

2016 నుంచి సీరియల్స్‌లో అవకాశాలు వచ్చాయి. ఫెవరెట్‌ నటీనటుల్ని ఇమిటేట్‌ చేస్తూ ఫేమస్‌ అయ్యింది.

This browser does not support the video element.

‘బహు హమారీ రజినీ కాంత్‌’, ‘యో కే హువా బ్రో’, ‘హైవాన్‌: ది మాన్‌స్టర్‌’, ‘కుండలి భాగ్య’ తదితర సీరియల్స్‌లో నటించింది.

కత్రినా కైఫ్‌తో పాటు ఓ యాడ్‌లోనూ నటించింది. ప్రస్తుతం అనేక బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.

‘ఫియర్‌ ఫ్యాక్టర్‌: కత్రోంకీ కిలాడి’ షోలో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు ఛాన్స్‌లు తగ్గినా.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. 

This browser does not support the video element.

తరచూ దుబాయి, శాన్‌ఫ్రాన్సిస్కో అంటూ సరదా ట్రిప్‌లు వేస్తుంటుంది. ఖాళీ సమయం దొరికితే డ్యాన్స్‌ చేస్తుంది.

హీరోల్లో రజనీకాంత్‌, అక్షయ్‌ కుమార్‌, హృతిక్‌ రోషన్‌లకు వీరాభిమాని. హీరోయిన్ల విషయానికొస్తే .. శ్రీదేవి, రేఖ, హేమమాలిని, కత్రినా కైఫ్‌ అంటే ఇష్టం.

గ్లామర్‌ పోజులతో నిండిపోయిన ఆమె ఇన్‌స్టా ఖాతాకు 2.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. 

This browser does not support the video element.

నటిగానే కాదు, రచయితగానూ రిధిమా ఆకట్టుకుంటూ ఉంటుంది. కవితలు రాసి, చదివి వీడియోలు చేస్తూ షేర్‌ చేస్తుంటుంది.

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

ఈ హీరోయిన్ల ‘టాటూ’ అర్థం తెలుసా?

స్ట్రాప్‌లెస్‌ ట్రెండ్‌ గురించి విన్నారా!

Eenadu.net Home