తాజ్‌దార్ కా ప్యారీ ఆలమ్‌జేబ్
‘హీరామండి’ చూసిన వారికి ఆలమ్ జేబ్ పరిచయం అవసరం లేదు. కీలకమైన ఆ పాత్రలో అలరించింది షర్మిన్ సెగల్.
సిరీస్ కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. తాజ్‌దార్‌కి ప్రేయసిగా ఆలమ్ పాత్రలో అలరించింది.
This browser does not support the video element.
తన పేరు కంటే ఆలమ్‌జేబ్ అంటేనే ఎక్కువమంది గుర్తు పడుతున్నారు. కవితలు రాస్తూ ఆ పాత్రలో అంతలా ఒదిగిపోయింది.
సంజయ్ లీలా భన్సాలీకి ఈమె స్వయానా మేనకోడలు. అయినా ‘హీరామండి’లోకి తీసుకునేందుకు 17 సార్లు ఆడిషన్ తీసుకున్నారట.
ముంబయిలో పుట్టిన షర్మిన్.. లాస్ ఏంజిలెస్‌లో చదువు పూర్తి చేసింది.
డాక్టర్ అవ్వాలనుకున్నా.. కుటుంబం మొత్తం పరిశ్రమలోనే ఉండటంతో ఇటువైపు వచ్చేసింది.
‘రామ్ లీలా’తో 2013లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ‘మేరీ కోమ్’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘గంగూభాయ్ కాటియావాడి’ చిత్రాలకు అసిస్టెంట్‌గా చేసింది.
భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘మలాల్’తో 2019లో తెరపై కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ‘హీరామండి’లోనే నటించింది.
This browser does not support the video element.
షర్మిన్ ఫ్రెండ్స్ గ్రూప్‌లో జాన్వీ కపూర్, ప్రియాంక చోప్రా లాంటి స్టార్‌లు ఉన్నారు. వీరంతా పార్టీలు, ఫంక్షన్లలో సందడి చేస్తుంటారు.
కప్ కేకులు, కుకీలు నచ్చుతాయి. ప్రియాంక, ఐశ్వర్య నటన అంటే ఇష్టం. ‘దేవ్‌దాస్’ ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్దదంటోంది.
గతేడాది నవంబర్‌లో వ్యాపారవేత్త ఆమన్ మెహతాని వివాహం చేసుకుంది షర్మిన్.
సగటు బాలీవుడ్ నటిలా.. ఫొటోషూట్లు, గ్లామర్ పోజులతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది.