ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు
భారత అథ్లెట్ మను బాకర్ ఒలింపిక్స్‌లో సత్తా చాటింది. వ్యక్తిగత, మిక్స్‌డ్ విభాగాల్లో పతకాలు సాధించి.. స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది.
మొన్న వ్యక్తిగత విభాగంలో కాంస్య సాధించిన మను.. తాజాగా మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి భారత్‌కు మరో కాంస్య పతకాన్ని అందించింది.
ఈమె పుట్టి పెరిగింది హరియాణాలో. తండ్రి చీఫ్ ఇంజనీర్ రామ్‌కిషన్ బాకర్. 14 ఏళ్ల వయసులోనే మను మనసు షూటింగ్ వైపునకు మళ్లిందట.
ఈమె ఇష్టాన్ని అర్థం చేసుకున్న తండ్రి వెన్నంటే నిలిచారు. కుమార్తె అడిగిన షూటింగ్ పిస్టల్‌ని ఆమెకు ఇచ్చి అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు.
షూటింగ్‌పై మక్కువ ఉన్న ఈమె రోజులో ఎక్కువ సమయాన్ని ప్రాక్టీసుకే కేటాయిస్తుంది.
This browser does not support the video element.
ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెడుతుంది. జిమ్‌లో ఎంతో కఠినమైన వర్కౌట్లు అయినా ఇష్టంతో ఉత్సాహంగా చేస్తుంది. భోజనం, నిద్ర వేళల్లో సంయమనం పాటిస్తుంది.
‘మన శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ పని మీదైనా దృష్టి సారించగలం. నాకు ఫిట్‌నెస్ అంటే చాలా ఇష్టం. దానికోసం నిరంతరం శ్రమించినా నాకు ఆనందాన్నిస్తుంది’ అని చెబుతోందీమె.
This browser does not support the video element.
హార్స్ రైడింగ్ ఈమె హాబీ. దీని వల్ల మనసు, శరీరం రిఫ్రెష్ అవుతాయని చెబుతుంటుంది.
షూటింగ్‌తో పాటు వ్యక్తిగత జీవితానికీ సమయం కేటాయిస్తుంది. స్నేహితులతో కలిసి అప్పుడప్పుడూ ట్రిప్పులు వేయాల్సిందే అంటుందీ యువ షూటర్.
ఈమెకి పెంపుడు జంతువులంటే అభిమానం. వాటితో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేస్తూ ఉంటుంది. అన్నట్టు ఈమె ఇన్‌స్టాని 2లక్షలకు పైగా ఫాలో అవుతున్నారు.