సొంత అవుట్‌ ఫిట్‌తో కేన్స్‌కు!

ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్లదే ట్రెండ్‌.. ఆ కోవకే చెందిన నాన్సీ త్యాగి తాజాగా కేన్స్‌ వేదికపై సందడి చేసి ఔరా అనిపించింది.

యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో వీడియోలు చేస్తూ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టింది. ఈ రోజు అవే తనను కేన్స్‌ వేదిక వరకూ వెళ్లేలా చేశాయి.

భారత్‌ నుంచి సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల జాబితాలో 77వ కేన్స్‌ చిత్రోత్సవానికి హాజరైంది నాన్సీ త్యాగి. ఈమెకు సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో క్రేజ్‌ ఉంది.

ఏదైనా అకేషన్‌ ఉందంటే మంచి డిజైనర్‌తో డ్రెస్సులు డిజైన్‌ చేయించుకుంటాం. కానీ నాన్సీ అలా కాదు. తను వేసుకునే అవుట్‌ ఫిట్‌ మొత్తం తనే డిజైన్ చేసుకొని కుడుతుంది.

కేన్స్‌లో రెడ్‌ కార్పెట్‌పై హొయలొలికించేందుకు కూడా తన డ్రెస్సుని స్వయంగా డిజైన్‌ చేసుకుంది. ఇప్పుడంతా నెట్టింట ఇదే చర్చ నడుస్తోంది. 

This browser does not support the video element.

ప్రముఖ డిజైనర్లకు ఏ మాత్రం తీసిపోకుండా డిజైన్‌ చేసుకున్న బేబి పింక్‌ లాంగ్‌ ఫ్రాక్‌కు దాదాపు 20 కిలోల నెట్‌ క్లాత్‌ను ఉపయోగించింది. దీన్ని పూర్తిగా స్టిచ్‌ చేసేందుకు నెల రోజులు పట్టిందట.

ఈ అవుట్‌ ఫిట్‌ చూసిన వాళ్లు తనపై ప్రశంసలు కురుపిస్తున్నారు. ఇదే కాదు కేన్స్‌ కోసం ధరించిన ప్రతి డ్రెస్సూ తను డిజైన్‌ చేసుకున్నవే. ప్రస్తుతం మీడియాలో వైరల్‌గా మారింది నాన్సీ.


ఈమెకు యూట్యూబ్‌లో 1.21 మిలియన్‌ సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. ట్రావెలింగ్‌ వ్లాగ్స్‌. డ్రెస్‌ డిజైనింగ్‌ వంటి పలు వీడియోలు అప్‌లోడ్‌ చేస్తుంది. వాటికి మిలియన్లలో వ్యూస్‌, లైకులు వస్తాయి.

23 ఏళ్ల నాన్సీది ఉత్తర్‌ ప్రదేశ్‌. మొదట్లో రీల్స్‌ చేస్తూ ఫేమస్‌ అయ్యింది. పోను పోను బడ్జెట్‌లో నచ్చిన డ్రెస్సులను కుట్టుకోవడం ఎలా అంటూ వీడియోలు చేయడం మొదలుపెట్టింది. అలా ఫాలోవర్లను పెంచుకుంది.

ఐఏఎస్‌ చదవాలనుకున్న ఈమె పరిస్థితులు అనుకూలించక ఫ్యాషన్‌ డిజైనింగ్‌ మీద ఆసక్తితో ఇలా డిజైనర్‌గా, ఇన్‌ఫ్లూయెన్సర్‌గా అభిమానుల్ని సంపాదించుకుంది. 

తన సొంత అవుట్‌ఫిట్‌తో గ్లామర్‌ పోజులతో ఇన్‌స్టాలో తరచూ ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తుంది నాన్సీ. తన్‌ ఇన్‌స్టా ఖాతాకి 1.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

అగ్ర హీరోలతో దుషారా

ధనుష్‌.. ఓ ఇన్‌స్పిరేషన్‌

శ్రుతి హాసన్ @ 15.. ఈ విషయాలు తెలుసా?

Eenadu.net Home