హీరో నుంచి 440 సీసీ బైక్‌.. వివరాలివీ!

బైక్‌ ప్రియులను కొన్ని రోజులుగా ఊరిస్తున్న మేవ్రిక్‌ 440 మోటార్‌ సైకిల్‌ను హీరో మోటోకార్ప్‌ జనవరి 23న ఆవిష్కరించింది.

హీరో వరల్డ్‌ పేరిట నిర్వహించిన ఈవెంట్‌లో ఈ బైక్‌ను పరిచయం చేసింది. హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125సీసీ బైక్‌ను కూడా ఇదే ఈవెంట్‌లో లాంచ్‌ చేసింది.

హీరో మేవ్రిక్‌ 440 బుకింగ్స్‌ ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నాయి. బైక్‌ ధర అప్పుడే వెల్లడి కానుంది. ఏప్రిల్‌ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. 

దీని ధర సుమారు రూ.2.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌) ఉండొచ్చని అంచనా.

గతేడాది హీరో- హార్లే భాగస్వామ్యంలో వచ్చిన హార్లేడేవిడ్‌సన్‌ ఎక్స్‌ 440 ప్లాట్‌ఫామ్‌పైనే కొత్త మేవ్రిక్‌ 440ని తీసుకొచ్చారు.

దీంట్లో 440 సీసీ ఆయిల్‌ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ అమర్చారు. 6 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ ఉంది. 

డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకునేందుకు వీలుగా బ్లూటూత్‌ కనెక్టవిటీ ఇచ్చారు.

ట్రయంఫ్‌ స్క్రాంబ్లర్‌ 400, స్పీడ్‌ 400, హార్లే ఎక్స్‌440, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌, క్లాసిక్‌ 350, హోండా సీబీ 350 బైక్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఫ్యూయల్‌పై రివార్డులందించే కార్డులివే..

వీళ్లు ట్యాక్స్‌ ఎంత కడుతున్నారో తెలుసా?

మెటల్‌ మెరుపులు అద్దుకున్న క్రెడిట్‌ కార్డులివే

Eenadu.net Home