తండ్రి పాత్రకైనా ‘సై’

#ఈనాడు

ఇచ్చిన మాట కోసం తండ్రి స్థానంలో నిలబడి విజ్జిపాపను లక్ష్యం వైపు నడిపే పాత్రలో ‘భగవంత్‌ కేసరి’గా అదరగొట్టారు బాలకృష్ణ. దసరా కానుకగా విడుదలై ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. దర్శకుడు: అనిల్‌ రావిపూడి.

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మరో సినిమా ‘లియో’. ఇందులో హీరో విజయ్‌ ఇద్దరు పిల్లలకు తండ్రిగా కనిపిస్తారు. దర్శకుడు: లోకేశ్‌ కనగరాజ్‌.


డాటర్‌- ఫాదర్‌ సెంటిమెంట్‌ ప్రధానంగా నాని హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా సినిమా ‘హాయ్‌ నాన్న’. డిసెంబరు 7న రిలీజ్‌. దర్శకత్వం: శౌర్యువ్‌.

వెంకటేశ్‌ హీరోగా రూపొందుతోన్న 75వ చిత్రం ‘సైంధవ్‌’. ఈ సినిమా కథ కూడా తండ్రీ కూతుళ్ల అనుబంధంతో అల్లుకున్నదే. 2024 జనవరి 13న విడుదల. దర్శకత్వం: శైలేష్‌ కొలను.

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ సైతం తెరపై ఫాదర్‌గా కనిపించనున్నారు. ఆ సినిమానే ‘ఫ్యామిలీ స్టార్‌’. 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తుంది. డైరెక్టర్‌: పరశురామ్‌.

తండ్రీతనయుల కథాంశంతో సుధీర్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘మా నాన్న సూపర్‌ హీరో’. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ‘జైలర్‌’లోనూ తండ్రీకొడుకుల సెంటిమెంట్‌ కీలకం. రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే.

విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉగ్రం’లో అల్లరి నరేశ్‌ ఓ పాపకు ఫాదర్‌గా కనిపిస్తారు.

కమల్ హాసన్‌- లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన హిట్‌ మూవీ ‘విక్రమ్’. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో తాత- మనవడు, తండ్రి- కొడుకు ఎమోషన్‌ అంతర్లీనంగా ఉంటుంది.

హసిత్‌ గోలి తెరకెక్కించిన ‘రాజ రాజ చోర’లో శ్రీ విష్ణు ఓ అబ్బాయికి తండ్రిగా నటించారు.

హీరో కార్తి- డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ కాంబోలో వచ్చిన చిత్రం ‘ఖైదీ’. ఇందులో కూతురితో అనుబంధమే ప్రధానం.

పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ‘అసురన్‌’లో హీరో ధనుష్‌ ఇద్దరు పిల్లలకు తండ్రిగా నటించి మెప్పించారు. వెట్రిమారన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిట్‌గా నిలిచింది.

అజిత్‌ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘విశ్వాసం’. తండ్రీకూతుళ్ల ప్రేమానురాగాలతో ముడిపడిన చిత్రమిది. ఇందులోని ‘చిన్నారి తల్లి’ పాట ప్రతి తండ్రికీ ఫేవరెట్‌ అయిందనడంలో సందేహం లేదు.

అగ్ర హీరోలతో దుషారా

ధనుష్‌.. ఓ ఇన్‌స్పిరేషన్‌

శ్రుతి హాసన్ @ 15.. ఈ విషయాలు తెలుసా?

Eenadu.net Home