‘లంగా ఓణీ’ లుక్.. అదో మ్యాజిక్!
జాన్వీ కపూర్..
‘దేవర’లో జాన్వీ ‘తంగం’ పాత్ర పోషిస్తుంది. ఆ రోల్‌లో ఆమె లంగా ఓణీలో పల్లెటూరి అమ్మాయిలా అలరించనుంది.
శ్రీలీల..
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’లో శ్రీలీల కనిపించిన విభిన్న లుక్స్‌లో ఇదొకటి. పాత్ర పేరు: విజ్జి పాప.
కాజల్ అగర్వాల్..
‘భగవంత్ కేసరి’లో కాజల్ ఇలా బాలకృష్ణతో ఆడిపాడింది. పాత్ర పేరు: కాత్యాయని.
సంయుక్త..
సాయి ధరమ్‌తేజ్ హీరోగా రూపొందిన ‘విరూపాక్ష’లో ఈ లుక్‌తోనే ‘మ్యాజిక్’ చేసింది సంయుక్త. పాత్ర పేరు: నందిని.
రష్మిక..
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్’లోని రష్మిక లుక్ ఇది. ‘పుష్ప: ది రూల్’లోనూ ఆమె ఇలానే కనిపించనుంది. పాత్ర పేరు: శ్రీవల్లి.
సాయి పల్లవి..
సాయి పల్లవి ఎంపిక చేసుకునే పాత్రలన్నీ దాదాపు లంగా ఓణీతో ముడిపడే ఉంటాయి. నాగ చైతన్య ‘లవ్‌స్టోరి’ (మౌనిక), రానా ‘విరాటపర్వం’ (వెన్నెల)లోని స్టిల్స్ ఇవి.
సమంత..
రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందిన ‘రంగస్థలం’లో సమంత ఇలా సందడి చేసింది. పాత్ర పేరు: రామలక్ష్మి.
రకుల్‌ప్రీత్ సింగ్..
వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కొండపొలం’లో రకుల్‌ప్రీత్ సింగ్ ఇలా కనిపిస్తుంది. పాత్ర పేరు: ఓబులమ్మ.
పూజాహెగ్డే..
వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘గద్దలకొండ గణేష్’లో పూజాహెగ్డే ఇలా ఆకట్టుకుంది. పాత్ర పేరు: శ్రీదేవి అలియాస్ దేవి.
నభా నటేశ్..
రామ్ హీరోగా రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’లోని బోనాలు పాటలో నభా నటేశ్ ఈ హాఫ్ శారీలోనే నటించింది.