రావణాసురుడి హీరోయిన్లు!
అను ఇమ్మాన్యుయేల్
నాని ‘మజ్ను’తో టాలీవుడ్‌కి పరిచయమైన అను.. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య వంటి స్టార్ హీరోలతో నటించింది.
Image:Instagram
చాలాకాలం తర్వాత ఈ మధ్య అల్లు శిరీష్‌తో కలిసి ‘ఊర్వశివో.. రాక్షసివో’లో మెరిసింది.. ‘రావణాసుర’లో కనిపించింది తక్కువ సేపే అయినా.. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
Image:Instagram
ఫరియా అబ్దుల్లా
‘జాతిరత్నాలు’లో చిట్టిగా కుర్రాళ్లను ఆకట్టుకుంది ఫరియా. లాయర్‌గా కోర్టులో వాదనలు వినిపించి నవ్వులు పూయించింది.
Image:Instagram
‘రావణాసుర’లోనూ ఈ భామ క్రిమినల్ లాయర్‌గా కనిపించింది. రవితేజ ఈమె వద్ద జూనియర్ లాయర్‌గా పనిచేస్తాడు.
Image:Instagram
మేఘా ఆకాశ్
నితిన్ ‘లై’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఈ భామ తెలుగులో చాలా సినిమాలే చేసింది. కానీ, ఇప్పటి వరకు హిట్ దక్కలేదు.
Image:Instagram
ఇటీవల ‘ప్రేమదేశం’తో ప్రేక్షకుల్ని పలకరించినా నిరాశే ఎదురైంది. ‘రావణాసుర’ ఫస్టాఫ్‌లో మేఘా పాత్ర, నటన సినిమాకి బలంగా నిలిచాయి.
Image:Instagram
దక్షా నగార్కర్
‘హోరా హోరీ’, ‘జాంబీ రెడ్డి’ తదితర చిత్రాల్లో నటించిన దక్షా.. ‘బంగార్రాజు’లో చిన్న పాత్రలో కనిపించి.. ఓ పాటలో ఆడిపాడింది.
Image:Instagram
తొలిసారిగా స్టార్ హీరో రవితేజ ‘రావణాసుర’లో నటించింది. సినిమా సాంతం కనిపిస్తూ అలరించింది.
Image:Instagram
పూజితా పొన్నాడ
నాగార్జున-కార్తి నటించిన ‘ఊపిరి’లో చిన్న పాత్రతో వెండితెరపై మెరిసిన పూజిత.. ‘రంగస్థలం’, ‘కల్కీ’, ‘ఓదెల రైల్వే స్టేషన్’ తదితర చిత్రాల్లో నటించింది.
Image:Instagram
ఇప్పుడు ‘రావణాసుర’లోనూ ఓ పాత్ర పోషించింది. గుర్తింపు తెచ్చేంత పాత్ర కాకపోయినా.. తన పరిధి మేరకు పూజితా చక్కగా నటించింది.
Image:Instagram