అక్కడా ఉంటాం.. ఇక్కడా ఉంటాం!

కొందరు తారలు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్‌సిరీస్‌ల్లోనూ మెరుస్తున్నారు. రెండు పడవలపై ప్రయాణం చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్నారు. 

అలా ‘మేం అక్కడా ఉంటాం.. ఇక్కడా ఉంటాం’ అనే వారెవరో చూసేయండి.. 

సమంత..

‘శాకుంతలం’, ‘ఖుషి’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన సమంత ‘ది ఫ్యామిలీమ్యాన్‌ 2’ (అమెజాన్‌ ప్రైమ్‌)తో సిరీస్‌తో ఆకట్టుకుంది. ‘సిటాడెల్‌’ (అమెజాన్‌ ప్రైమ్‌)తో త్వరలోనే సందడి చేయనుంది.

తమన్నా..

‘లస్ట్‌ స్టోరీస్‌ 2’, ‘జైలర్‌’, ‘భోళా శంకర్‌’ సినిమాల్లో తళుక్కుమన్న తమన్నా ‘జీ కర్దా’ (అమెజాన్‌ ప్రైమ్‌), ‘ఆఖ్రీ సచ్‌’ (డిస్నీ+ హాట్‌స్టార్‌) వెబ్‌సిరీస్‌లతో ఆకట్టుకుంది. పాత సిరీస్‌లు: 11th అవర్‌ (ఆహా), నవంబరు స్టోరీ (డిస్నీ+ హాట్‌స్టార్‌).

నిత్యా మేనన్‌..

ధనుష్‌ 50వ చిత్రం, ఓ మలయాళ సినిమాలో హీరోయిన్‌ నిత్యా మేనన్‌. ఆమె నటించిన తాజా వెబ్‌సిరీస్‌లు కుమారి శ్రీమతి (అమెజాన్‌ ప్రైమ్‌), మాస్టర్‌పీస్‌ (డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ నెల 25న విడుదల కానుంది). గతంలో ‘బ్రీత్‌’, ‘మోడ్రన్‌ లవ్‌’ సిరీస్‌ల్లో నటించింది.

అంజలి..

‘ఇరాట్ట’తో అలరించిన అంజలి ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’, ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాల్లో నటిస్తోంది. ‘బహిష్కరణ’ (జీ 5) వెబ్‌సిరీస్‌ విడుదలకావాల్సి ఉంది. ఇప్పటికే ఆమె ‘నవరస’ (నెట్‌ఫ్లిక్స్‌), ‘ఝాన్సీ’, ‘ఫాల్‌’ (డిస్నీ+హాట్‌స్టార్‌)లతో మెప్పించింది.

ఈషా రెబ్బా..

‘మామా మశ్చీంద్ర’ సినిమాతో ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈషా రెబ్బా. ఇప్పటికే ఆమె నాలుగు సిరీస్‌ల్లో నటించింది. 3 రోజెస్‌ (ఆహా), పిట్ట కథలు (నెట్‌ఫ్లిక్స్‌), మాయా బజార్‌ ఫర్‌ సేల్‌ (జీ 5), దయా (డిస్నీ+హాట్‌స్టార్‌).

ప్రియమణి..

‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ (అమెజాన్‌ ప్రైమ్‌) వెబ్‌సిరీస్‌తో మంచి క్రేజ్‌ వచ్చింది. ‘హిజ్‌ స్టోరీ’ (జీ5, ఆల్ట్‌ బాలాజీ), సర్వం శక్తిమయం (జీ 5)లో నటించింది. ‘కొటేషన్‌ గ్యాంగ్‌’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకురానుంది. ‘కస్టడీ’, ‘జవాన్‌’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది.

కాజల్‌..

‘భగవంత్‌ కేసరి’, ‘భారతీయుడు 2’, ‘సత్యభామ’ తదితర చిత్రాలతో బిజీగా ఉన్న నాయిక కాజల్‌. ఈమె నటించిన ‘లైవ్‌ టెలీకాస్ట్‌’ వెబ్‌సిరీస్‌ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

పాయల్‌..

పాయల్‌ రాజ్‌పుత్‌ ‘3 రోజెస్‌’ వెబ్‌సిరీస్‌లో నటించింది. ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన ‘మంగళవారం’ సినిమా నవంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

హన్సిక..

‘మై 3’ (డిస్నీ+హాట్‌స్టార్‌) వెబ్‌సిరీస్‌తో థ్రిల్‌ పంచిన హన్సిక ‘మ్యాన్‌’, ‘గాంధారి’, ‘గార్డియన్‌’ తదితర చిత్రాల్లో నటిస్తోంది. 

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home