ఈ హీరోయిన్లు దర్శకుల వారసులు!

అదితి శంకర్‌

దిగ్గజ దర్శకుడు శంకర్‌ తనయ అదితి శంకర్‌ తొలిసారి హీరో కార్తితో ‘విరుమన్‌’లో నటించింది. శివకార్తికేయన్‌తో ‘మావీరన్‌’చేస్తోంది. వరుణ్‌ తేజ్‌ ‘గని’లో పాట పాడి గాయనిగానూ నిరూపించుకుంది. 

Image: Instagram

ఆలియా భట్‌

హిందీ చిత్ర దర్శకుడు మహేశ్‌ భట్‌ కుమార్తె ఆలియా భట్‌ ప్రస్తుతం బీటౌన్‌లో స్టార్‌ హీరోయిన్. 2012లో ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’తో కెరీర్‌ మొదలుపెట్టి సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా మారింది.

Image: Instagram

కల్యాణి ప్రియదర్శన్‌

సినీ దర్శకుడు ప్రియదర్శన్‌ కుమార్తె కల్యాణి నటిగా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. అక్కినేని అఖిల్‌ ‘హలో’తో తెరంగేట్రం చేసిందీ భామ.

Image: Instagram

ఐశ్వర్య అర్జున్‌ 

నటుడు, దర్శకుడు అర్జున్ కుమార్తె 2013లోనే విశాల్‌ ‘ధీరుడు’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పలు కన్నడ, తమిళ సినిమాల్లో నటించింది. త్వరలోనే తెలుగులోనూ నటించనుంది.

Image: Instagram

సయీ మంజ్రేకర్‌

‘అదుర్స్‌’ సినిమాలో విలన్‌గా చేసిన హిందీ దర్శకుడు మహేశ్‌ మంజ్రేకర్‌ కుమార్తె సయీ మంజ్రేకర్‌. వరుణ్‌ తేజ్‌ ‘గని’తో టాలీవుడ్‌కి పరిచయమై.. అడవి శేష్‌ ‘మేజర్‌’లోనూ మెరిసింది.

Image: Instagram

శ్రుతి హాసన్‌

దిగ్గజ నటుడు, దర్శకుడు కమల్‌ హాసన్‌ కుమార్తెగా వెండితెరకు పరిచయమైన శ్రుతి.. తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. నటిగానే కాకుండా సింగింగ్‌, డ్యాన్సింగ్‌లోనూ ఔరా అనిపిస్తోంది.

Image: Instagram

శివాని రాజశేఖర్‌

జీవిత రాజశేఖర్‌ దంపతుల పెద్ద కుమార్తె శివాని ‘అద్భుతం’తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తనదైన నటనతో ప్రేక్షకుల్నిఆకట్టుకుంటోంది.

Image: Instagram

శివాత్మిక రాజశేఖర్‌

జీవిత రాజశేఖర్‌ దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక కూడా హీరోయిన్‌గా రాణిస్తోంది. విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండతో కలిసి ‘దొరసాని’లో నటించింది. వీరిద్దరికీ ఇదే తొలి చిత్రం.

Image: Instagram

యామి గౌతమ్‌

పంజాబీ సినిమా దర్శకుడు ముకేశ్‌ గౌతమ్‌ కుమార్తె యామి గౌతమ్‌. యాడ్స్‌తో పాపులర్‌ అయిన ఈ భామ ‘గౌరవం’తో తెలుగులో పరిచయమైంది. ఇటీవల దర్శకుడు ఆదిత్య ధర్‌ను పెళ్లి చేసుకుంది.

Image: Instagram

సమారా తిజోరి

బాలీవుడ్‌ దర్శకుడు దీపక్‌ తిజోరి కుమార్తె సమారా తిజోరి సైతం సినీ రంగాన్నే ఎంచుకొంది. అభిషేక్‌ బచ్చన్‌ ‘బాబ్‌ బిస్వాస్‌’తో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. వెబ్‌ సిరీసుల్లోనూ రాణిస్తోంది.

Image: Instagram

విజయలక్ష్మి అగతియన్‌‌

‘ఈ అబ్బాయి చాలా మంచోడు’ సినిమా దర్శకుడు అగతియన్‌ కుమార్తె విజయలక్ష్మి తమిళ పరిశ్రమలో హీరోయిన్‌గా రాణిస్తోంది. వరుస అవకాశాలతో బిజీగా మారింది.

Image: Instagram

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home