WPLలో టాపర్ స్మృతి మంధాన!
భారత్‌లో తొలిసారిగా విమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) నిర్వహిస్తున్నారు. ఈ లీగ్ కోసం జరిగిన వేలంలో మహిళా క్రికెటర్ స్మృతి మంధాన రికార్డు సృష్టించింది.
Image: Instagram/Smriti Mandhana
వేలంలో నిలిచిన ప్లేయర్లలో స్మృతి అత్యధిక ధర పలికింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ రూ.3.40 కోట్ల ధర వెచ్చించి ఈమెను దక్కించుకుంది.
Image: Instagram/Smriti Mandhana
ఈ ఇండియన్ స్టార్ క్రికెటర్ ముంబయిలో 1996 జులై 18న జన్మించింది. ఆమె తండ్రి, సోదరుడు కూడా క్రికెటర్లే. వారి స్ఫూర్తితోనే స్మృతి క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది.
Image: Instagram/Smriti Mandhana
దేశీయ క్రికెట్‌లో రాణించిన ఈ లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్.. బీసీసీఐ దృష్టిలో పడి జాతీయ జట్టులో చోటు దక్కించుకుంది. గత పదేళ్లుగా టీమ్‌ఇండియా తరఫున ఆడుతోంది.
Image: Instagram/Smriti Mandhana
తన కెరీర్‌లో ఇప్పటి వరకు 77 వన్డేలు ఆడి.. 3,073 పరుగులు, 112 టీ20లు ఆడి 2,651 పరుగులు సాధించింది. 4 టెస్ట్‌లు ఆడి.. 325 పరుగులు చేసింది.
Image: Instagram/Smriti Mandhana
స్మృతికి క్రికెట్ కాకుండా.. ఫుట్‌బాల్, టెన్నిస్ క్రీడలంటే చాలా ఇష్టం. వీలు కుదిరినప్పుడల్లా ఈ క్రీడల్ని వీక్షిస్తుందట. మొబైల్ గేమ్స్ కూడా బాగా ఆడుతుందట.
Image: Instagram/Smriti Mandhana
దేశంలో అత్యధిక మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న క్రికెటర్లు విరాట్ కోహ్లీ, స్మృతి మంధాన. వీరిద్దరి జెర్సీ నంబర్ 18 కావడం విశేషం.
Image: Instagram/Smriti Mandhana
This browser does not support the video element.
క్రికెటర్లకు ఫిట్‌నెస్ చాలా ముఖ్యం.. అందుకే స్మృతి కూడా క్రమం తప్పకుండా జిమ్‌లో కసరత్తులు చేస్తుంటుంది.
Image: Instagram/Smriti Mandhana
మైదానంలో దేశం కోసం సీరియస్‌గా పోరాడే ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఖాళీ సమయంలో విహారయాత్రలు చేస్తూ జాలీగా గడిపేస్తుంటుంది.
Image: Instagram/Smriti Mandhana
ఇటీవల ఫోర్బ్స్ మ్యాగజీన్‌లో ఆమె గురించి కథనం ప్రచురించారు. ఆ మ్యాగజీన్ కవర్ పేజీపై తన ఫొటోనే ముద్రించారు.
Image: Instagram/Smriti Mandhana
ఈ మధ్యే ‘నీమ్ ఆయూ’ అనే ఆయుర్వేదిక్ ఉత్పత్తుల కంపెనీలో స్మృతి పెట్టుబడి పెట్టింది. ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోంది.
Image: Instagram/Smriti Mandhana
స్మృతి.. క్రికెటర్‌గానే కాదు.. మోడల్‌గానూ తళుక్కుమంటోంది. అప్పడప్పుడూ ఫ్యాషన్ షోల్లో గ్లామర్ దుస్తుల్లో కనిపించి ఆకట్టుకుంటోంది.
Image: Instagram/Smriti Mandhana