దేనికి ఎంత కరెంట్ ఖర్చవుతుందంటే!
ఉరుకుల పరుగుల జీవితం.. పనులన్నీ తొందరగా అవ్వాలంటే యంత్రాల సాయం తప్పనిసరి. దీంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. మొత్తం కరెంట్ బిల్లు 100 శాతం అనుకుంటే.. ఇంట్లో వాడే ఎలక్ట్రిక్ మిషిన్లకు ఎంత శాతం కరెంట్ ఖర్చవుతుందో తెలుసుకుందాం.
image:RKC
కరెంట్ బిల్లుకి సగం కారణం ఏసీలే! ఇవి 40.7 శాతం కరెంట్‌ను వినియోగించుకుంటాయి! కేవలం ఏసీ మాత్రమే కాదు వేసవిలో ఉపయోగించే ఫ్యాన్లు, కూలర్లు కూడా ఎక్కువ మొత్తంలో వినియోగించుకుంటాయి.
image:RKC
ఇంట్లో వాటర్ హీటర్లు వాడుతున్నారా! దానికోసం 13.6శాతం కరెంటు అవసరముంటుంది.
image:RKC
ఎల్ఈడీ టీవీ, వాషింగ్ మిషిన్, డిష్‌వాషర్లు 5 శాతం కరెంటును వినియోగించుకుంటాయి.
image:RKC
రిఫ్రిజిరేటర్లకు 4 శాతం కరెంటు అవసరం ఉంటుంది. వీటిని ఎప్పుడూ ఆన్‌లోనే ఉంచండి. చాలామంది కాస్త కూల్ కాగానే ఫ్రిడ్జ్‌ని ఆఫ్ చేస్తుంటారు. దీంతో సాధారణ ఉష్టోగ్రతలోకి వచ్చేస్తుంది. మళ్లీ కూల్ అవ్వాలంటే చాలా సమయం పడుతుంది. కరెంటు కూడా ఎక్కువ ఖర్చవుతుంది.
image:RKC
ప్రస్తుతం బట్టలు ఆరబెట్టేందుకు అందుబాటులోకి వచ్చిన క్లాతింగ్ డ్రైయర్లు, ఐరన్ బాక్స్ లకు 3.2 శాతం కరెంటు అవసరమట!
image:RKC
స్పీకర్లు, ఇతర ఎంటర్‌టైన్మెంట్ డివైస్‌లు 2.9 శాతం కరెంట్ లాగేసుకుంటాయి.
image:RKC
ఇంట్లో మనం రకరకాల లైట్లను వాడుతుంటాం. ఈ లైట్లు 2.8 శాతం కరెంటును వాడుకుంటాయి.
image:RKC