భారతీయ వంటకాలకు హాలీవుడ్ ఫిదా..!
జూలియా రాబర్ట్స్
జూలియా ‘ఈట్ ప్రే లవ్’ సినిమా షూటింగ్‌లో భాగంగా కొన్ని రోజుల పాటు హరియాణాలో ఉన్నారు. ఈ క్రమంలో భారతీయ వంటకాలు రుచి చూసి ఫిదా అయ్యారు. స్పైసీ ఫుడ్‌ను ఇష్టంగా తిన్నారు.
Image: RKC
మడోన్నా
హాలీవుడ్ సింగర్ మడోన్నాకు.. దక్షిణ భారత వంటకాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఇడ్లీ చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ అని కితాబిచ్చారు.
Image: RKC
లేడీ గాగా
నటి, గాయని లేడీ గాగా మసాలాతో చేసిన భారతీయ కూరలను బాగా ఇష్టపడతారు. కొన్నాళ్లు డైటింగ్ చేసిన గాగా.. మానేసిన తర్వాత దాదాపు నెల రోజులపాటు రోజుకు మూడు పూటల భారతీయ వంటకాలతోనే భోజనం చేశారట.
Image: RKC
టామ్ క్రూజ్
హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ ఓసారి యూకేలో ఉన్న భారతీయ రెస్టారెంట్‌కు వెళ్లి చికెన్ టిక్కా మసాలా తిన్నారు. బాగా నచ్చడంతో మళ్లీ ఆర్డర్ చేశారు.
Image: RKC
విల్ స్మిత్
మరో హాలీవుడ్ సూపర్‌స్టార్ విల్ స్మిత్‌కి కూడా చికెన్ టిక్కా మసాలా బాగా నచ్చిందట. ఇక్కడ లభించే రకరకాల నాన్(రోటీ)లు బాగుంటాయన్నారు.
Image: RKC
బ్రాడ్ పిట్
భారతీయ వంటకాలు యూఎస్‌లో ఎక్కడ కనిపించినా తింటానని బ్రాడ్‌పిట్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Image: RKC
మండీ మూర్
చిత్రీకరణలో భాగంగా భారత్‌కు వచ్చిన నటి మండీ మూర్ బిహార్‌లో కొన్ని రోజులపాటు ఉండాల్సి వచ్చింది. అదే సమయంలో ఆమె అక్కడి మసాలా టీకి ఫిదా అయ్యారు. బిహార్ స్పెషల్ ఫుడ్ లిట్టి చోకా, కబాబ్స్ రుచి చూశారు.
Image: RKC
షకీరా
పాప్ సింగర్ షకీరాకి చికెన్ టిక్కా, ఆఫ్గానీ చికెన్, మటన్ మసాలా, రస్మలై, గజర్ కా హల్వా అంటే చాలా ఇష్టం.
Image: RKC
ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్
కండల వీరుడు ఆర్నాల్డ్.. భారతీయ వంటకాల్లో కబాబ్స్, నాన్ బుఖారాను ఇష్టంగా తింటారు.
Image: RKC