త్వరలో భారత్‌లోకి హానర్‌ ప్యాడ్‌ 8.. ఫీచర్లివే!

ఈ ఏడాది ప్రారంభంలో హానర్‌ ప్యాడ్‌ 8 ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. త్వరలో ఈ ట్యాబ్‌ భారత్‌లోనూ విడుదల కానుంది. వివరాలు ఇవిగో..

Image: Honor

హానర్‌ ప్యాడ్‌ 8లో 2కె రిజల్యూషన్‌తో 12 అంగుళాల డిస్‌ప్లే ఇచ్చారు. 174.06ఎంఎంx278.54ఎంఎంx6.9ఎంఎం కొలతలున్న ఈ ట్యాబ్‌ 520 గ్రాములుంటుంది.

Image: Honor

ఇందులో ఆక్టా కోర్‌ క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌ను వాడారు. మ్యాజిక్‌ యూఐ 6.1తో ఈ ట్యాబ్‌ పనిచేస్తుంది.

Image: Honor

దీని వెనుకవైపు, ముందువైపు 5 ఎంపీ కెమెరాలు అమర్చారు.

Image: Honor

ఇందులో 7,250 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 22.5వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

Image: Honor

ట్యాబ్‌లో 8 స్పీకర్‌ సెట్‌అప్‌, బ్లూటూత్‌ 5.1, ఓటీజీ, డ్యుయెల్‌ బ్యాండ్‌ వైఫై కనెక్టివిటీ ఫీచర్స్‌ ఉన్నాయి. మొబైల్‌ను ట్యాబ్‌లో యాక్సెస్‌ చేసే సదుపాయముంది.

Image: Honor

ఒకేసారి నాలుగు యాప్స్‌ను వేర్వేరు విండోస్‌లలో ఓపెన్‌ చేసి వాడుకోవచ్చు. ఈ-బుక్‌ మోడ్‌, డార్క్‌ మోడ్‌ ఉన్నాయి.

Image: Honor

ప్రస్తుతం విదేశాల్లో లభిస్తోన్న ఈ ట్యాబ్‌ ధర దాదాపు రూ. 25వేలు ఉంది. భారత మార్కెట్లో విడుదలైతే.. దీని ధర తగ్గే అవకాశముంది.

Image: Honor

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా..?

అలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్లాన్లు ఇవే..

Eenadu.net Home