ఇంటిని విక్రయిస్తున్నారా? నిపుణుల సలహాలివీ! 

మరో చోట స్థిరపడాలనో, చదువుల నిమిత్తమో, ఇతర ఆర్థిక అవసరాల కోసమో సొంతింటిని అమ్మేస్తుంటారు. అయితే, మంచి ధర పలకాలంటే కొన్ని పనులు చేయాలని నిపుణులంటున్నారు. 

image:RKC

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. నో బ్రోకర్‌, ప్రాప్‌టెక్, బ్రిక్స్‌ లాంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ ఫామ్స్ ఇల్లు అమ్మడానికి చాలా సహాయపడతాయి. 

image:RKC

ఇంటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను చక్కగా చిత్రీకరించి ఆన్‌లైన్‌లో ఉంచండి. వీలైతే 3డీ మోడల్‌లో ఇంటిని రూపొందిస్తే మంచిది. 

image:RKC

ఇంటిని అమ్మే ముందు ఏమైన లీకేజీలు ఉన్నాయేమో చూసుకోవాలి. వీటికి మరమ్మతులు చేయిస్తే ఇంటిని మంచి ధరకు అమ్మవచ్చు. 

image:RKC

ఇల్లు అందంగా, ఆకర్షణీయంగా ఉంటేనే కొనేవాళ్లు ముందుకొస్తారు. కాబట్టి.. మంచి రంగులతో గోడలను ఆకట్టుకునేలా మార్చండి.

image:RKC

ప్రస్తుతం మార్కెట్లో రకరకాల డిజైన్లలో వాల్‌ పేపర్లు అందుబాటులో ఉన్నాయి. రంగులు వేసే వీలు లేకుంటే వీటిని మీ ఇంటి గోడలకు అతికించేయండి. 

image:RKC

ఇల్లు వెలుతురుతో ఉంటేనే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అందుకే, ఇంట్లో వెలుతురు వచ్చేలా మార్పులు చేయండి. వెలుతురు ఎక్కువ ఇచ్చే బల్బులు అమర్చండి.

image:RKC

ఇల్లు అమ్మే ముందు విక్రయ పత్రాలు అన్నీ చట్టపరమైన విధానంలో సిద్ధం చేసుకోండి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

image:RKC

ఇంట్లో విద్యుత్‌ సదుపాయం సరిగ్గా ఉందా? ప్లగ్‌లు, స్విచ్‌లు సక్రమంగా పని చేస్తున్నాయో లేదో చెక్‌ చేయండి.

image: RKC

మార్కెట్లో మదుపు చేస్తున్నారా? ఇవి తెలుసా..

విజేతలు చెప్పిన సూత్రాలు మీకోసం..

ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ఐపీఓ.. కీ పాయింట్స్‌

Eenadu.net Home