ఆర్థిక లక్ష్యం చేరుకోవడం ఎలా?
ఇల్లు, పిల్లల చదువు, వివాహం ఇలా ప్రతి మనిషికి కొన్ని ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. మరి వాటిని చేరుకోవడానికి ఏం చేయాలి? ఈ 7 స్టెప్స్ ఫాలో అవ్వండి..
Image: Pixabay
1. మొదట మీ ఆర్థిక లక్ష్యం ఏంటి? దానికి ఎంత డబ్బు అవసరమవుతుందో లెక్కగట్టాలి.
Image: Pixabay
2. మీ ఆదాయం ఎంత? ప్రస్తుతం మీ వద్ద ఎంత డబ్బు ఉంది? ఇంకెంత పొదుపు చేయాలి వంటి విషయాలపై స్పష్టత తెచ్చుకోవాలి.
Image: RKC
3. ఖర్చులు తగ్గించుకొని పొదుపును పెంచాలి. విలాసాలకు పోకుండా కనీస అవసరాలకు మాత్రమే ఖర్చు చేస్తూ ఉన్నంతలో సంతోషంగా జీవించడం నేర్చుకోవాలి.
Image: RKC
4. మీ ఆదాయం నుంచి ఎంత ఖర్చు అవుతోంది? ఎంత మిగులుతోందనే విషయాలపై దృష్టిపెట్టాలి. బడ్జెట్ రూపొందించుకొని దాని ప్రకారమే ఖర్చులు చేయాలి.
Image: RKC
5. మీ ఆర్థిక లక్ష్యాలకు తగినట్లు ప్రతి నెలా కొంత డబ్బును దాచిపెట్టి.. మిగతా డబ్బుతోనే ఇంటి నిర్వహణ చూసుకోవాలి.
Image: RKC
6. దాచిపెట్టిన డబ్బును వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా రాబడి పెరుగుతుంది. తద్వారా ఆర్థిక లక్ష్యాన్ని తొందరగా చేరుకోవచ్చు. అయితే, పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. స్టాక్‌మార్కెట్లలో అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి.
Image: RKC
7. ఒక ఆర్థిక లక్ష్యం నెరవేరగానే మరొకటి ఏర్పరుచుకోవాలి. ఇలా ఒక్కో లక్ష్యాన్ని చేరుతూ జీవితం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగేలా చూసుకోవచ్చు.
Image: RKC