దుబారా ఖర్చు తగ్గించండిలా..

మీరు ఎక్కువగా చూడని ఓటీటీలు, అనవసర యాప్స్‌ సభ్యత్వాన్ని ఉపసంహరించుకోండి.

Image: RKC

విద్యుత్‌ సహా ఇతర బిల్లులు, ఫీజులు సమయానికి చెల్లించండి. గడువు దాటితే అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

Image: RKC

వీలైనంత వరకు ఆన్‌లైన్‌ లావాదేవీలే చేయండి. ఏటీఎమ్‌లో పరిమితికి మించి నగదు విత్‌డ్రా చేస్తే బ్యాంకులు రుసుము వసూలు చేస్తున్నాయి.

Image: RKC

క్రెడిట్‌ కార్డు బిల్లులను గడువులోపు కట్టేయండి. లేదంటే వాటిపై భారీ మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

Image: RKC

నాలుగైదు బీమాలు తీసుకొని వాటి ప్రీమియం చెల్లిస్తూ డబ్బు వృథా చేయకండి. మీకు, మీ కుటుంబానికి తగినట్లు ఒక జీవిత బీమా, ఒక ఆరోగ్య బీమా తీసుకుంటే సరిపోతుంది.

Image: RKC

ఇంట్లో అందరికీ మొబైల్స్‌ ఉంటాయి. వాటి రీఛార్జ్‌లకు పెద్దమొత్తంలోనే ఖర్చవుతుంది. కాబట్టి.. డాటా/కాల్స్‌ వినియోగానికి అనుగుణంగా రీఛార్జ్‌లు చేసుకోవాలి.

Image: RKC

కుటుంబసభ్యులతో రెస్టారంట్‌లో భోజనం, సినిమాలకి వెళ్లడం సరదాగానే ఉంటుంది. నెలకోసారి అయితే ఫర్వాలేదు. కానీ, వీకెండ్‌ హాలీడేస్‌ అంటూ ప్రతివారం షికార్లకు వెళ్లడం వల్ల డబ్బు వృథా అవుతుంది.

Image: RKC

ఈ కాలంలో వ్యక్తిగత వాహనం అవసరమే. అయితే, గొప్పలకు పోయి లగ్జరీ వాహనం కొనాల్సిన అవసరం లేదు. మీ బడ్జెట్‌లో మంచి వాహనం తీసుకోండి.

Image: RKC

మార్కెట్లోకి వచ్చే ప్రతి మొబైల్‌, గ్యాడ్జెట్‌ ఆకర్షిస్తుంటాయి. కానీ, మీరు మీ అవసరానికి తగిన డివైజ్‌ను మాత్రమే తీసుకోండి. దీంతో డబ్బు దుబారా కాకుండా ఉంటుంది.

Image: RKC

సూపర్‌ మార్కెట్‌కు వెళ్లినప్పుడు కంటికి కనిపించిన ప్రతి వస్తువునూ కొనాలనిపిస్తుంటుంది. అందుకే, ముందుగానే అవసరమైన వస్తువుల జాబితా సిద్ధం చేసుకొని వాటిని మాత్రమే కొనుగోలు చేయాలి.

Image: RKC

బిజినెస్‌లో రాణించాలంటే నిపుణుల సలహాలేంటో చూడండి..

అతిపెద్ద ఐపీఓలు ఇవే.. ఏది ఎప్పుడు?

పండగ బోనస్‌ వచ్చిందా? ఏం చేస్తారు?

Eenadu.net Home