ఒత్తిడితో ఒంటికి ఎంత నష్టమో తెలుసా?
ఒత్తిడి దీర్ఘకాలంగా కొనసాగితే.. అది శరీరంలోని ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతుంది.
Image:RKC
చర్మంపై మొటిమలు, దురద, దద్దుర్లు వంటివి ఏర్పడతాయి. అవి చర్మవ్యాధులకు దారితీయొచ్చు.
Image:RKC
జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అజీర్తి, ఆకలి మందగించడం, కడుపులో అల్సర్లు ఏర్పడే అవకాశముంది.
Image:RKC
ఒత్తిడికి గురైనప్పుడు క్లోమగ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తిలో మార్పులు ఏర్పడతాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయులో హెచ్చుతగ్గులు తలెత్తుతాయి. ఇది మధుమేహులకు ప్రమాదకరం.
Image:RKC
రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. దీంతో తరచూ ఇన్‌ఫెక్షన్ల బారిన పడటం, జబ్బుల తీవ్రత ఎక్కువవడం వంటి సమస్యలొస్తాయి.
Image:RKC
మెదడుపై ఒత్తిడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది తలనొప్పి, తీవ్రమైన కోపం, నిస్సత్తువ, ఆందోళన, కుంగుబాటుకి దారి తీస్తుంది.
Image:RKC
రక్తపోటు పెరగొచ్చు, గుండె కొట్టుకునే వేగం పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదముంది.
Image:Pixabay
కాలేయం కూడా గ్లూకోజ్‌ను అధికంగా ఉత్పత్తి చేయడంతో మధుమేహం వ్యాధి వచ్చే అవకాశముంది.
Image:RKC
పేగుల్లో పోషకాలు గ్రహించే సామర్థ్యం, జీర్ణక్రియ వేగం తగ్గిపోతుంది. మలబద్ధకం తదితర సమస్యలు ఏర్పడతాయి.
Image:RKC
శృంగారంపై ఆసక్తి పోతుంది. టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్ల ఉత్పత్తి పడిపోయి.. సంతాన సామర్థ్యం తగ్గుతుంది.
Image:RKC
కీళ్లు, కండరాల్లో నొప్పులు, వాపులు మొదలవుతాయి. వెన్నుముక బిగుసుకుపోతుంది. ఎముక సాంద్రత తగ్గుతుంది.
Image:RKC