గూగుల్‌.. ఎలా ట్రాక్‌ చేస్తుందో తెలుసా?

ఇంటర్నెట్‌లో మనకు ఎలాంటి సమాచారం కావాలన్నా ముందుగా వెతికేది గూగుల్‌లోనే. కానీ, గూగుల్‌.. మన సమాచారాన్ని సేకరిస్తూ మార్కెటింగ్‌ చేసుకుంటోంది. మన సమాచారాన్ని ఎలా ట్రాక్‌ చేస్తుందంటారా?

Image: RKC

క్రోమ్‌

క్రోమ్‌లో మనం అన్వేషించే అంశాలు, బ్రౌజింగ్‌ హిస్టరీ, చూసిన వెబ్‌సైట్స్‌ను ట్రాక్‌ చేస్తుంది. 

Image: RKC

యూట్యూబ్‌

మనం చూసే, అప్‌లోడ్‌ చేసే వీడియోలను ట్రాక్‌ చేస్తుంది.

Image: RKC

ఫొటోస్‌

మనం తీసిన ఫొటోలు, దిగిన లొకేషన్లు, వీడియోలు, డౌన్‌లోడ్‌ చేసుకున్నవాటిని ట్రాక్‌ చేస్తుంది.

Image: RKC

గూగుల్‌ యాప్‌

గూగుల్‌ యాప్‌లో మీరు ఏం వెతికినా వాటిని గూగుల్‌ ట్రాక్‌ చేస్తుంది. 

Image: RKC

క్యాలెండర్‌

మీరు గూగుల్‌ క్యాలెండర్‌లో సేవ్‌ చేసిన ఈవెంట్స్‌, ప్లాన్స్‌, అపాయింట్‌మెంట్స్‌ అన్నీ గూగుల్‌ సేకరిస్తుంది. 

Image: RKC

జీమెయిల్‌

మీ మెయిల్‌కు సంబంధించిన కాంటాక్ట్స్‌, మీరు పంపించే వ్యక్తుల మెయిల్‌ ఐడీలు వంటివి ట్రాక్‌ చేస్తుంది.

Image: RKC

గూగుల్‌ న్యూస్‌

మీరు తరచూగా చూసే న్యూస్‌ వెబ్‌సైట్స్‌, మీకు నచ్చిన వార్తలను ట్రాక్‌ చేస్తుంది. 

Image: RKC

డ్రైవ్‌

మీరు అప్‌లోడ్‌ చేసిన ఫైల్స్‌, డాక్యుమెంట్స్‌, ఫొటోలు ఇలా అన్నింటిని గూగుల్‌ గమనిస్తుంది. 

Image: RKC

మ్యాప్స్‌

మీరు వెళ్లే ప్రతి లొకేషన్‌ను గూగుల్‌ ఓ కంట కనిపెడుతుంది. మ్యాప్స్‌లో వెతికే ప్రదేశాల వివరాలను సేకరిస్తుంది. 

Image: RKC

గూగుల్‌ అసిస్టెంట్‌

మీరు వాయిస్‌ ద్వారా ఇచ్చే కమాండ్స్‌ను గూగుల్‌ అసిస్టెంట్‌ ట్రాక్‌ చేస్తుంది. మీకు ఫలితాలు చూపెడుతూనే ఆ సమాచారాన్ని భద్రపరుస్తుంది. 

Image: RKC

ఇలా సేకరించిన యూజర్‌ వివరాలను గూగుల్‌ గోప్యంగానే ఉంచుతుంది. థర్డ్‌ పార్టీ చేతుల్లోకి పోనివ్వదు. కానీ, గూగుల్‌ ప్రకటనల్లో వీటిని ఉపయోగించుకుంటుంది. 

Image: RKC

యూజర్‌ ఇష్టాయిష్టాలను గుర్తించి వాటికి అనుగుణంగా గూగుల్‌ వ్యవహరిస్తుంది. ఉదాహరణకు ఏదైనా వస్తువు గురించి అన్వేషిస్తే.. ఆ వస్తువుకు సంబంధించిన వివరాలు మీకు ప్రకటనల రూపంలో దర్శనమిస్తుంటాయి. 

Image: RKC

మిమ్మల్ని గూగుల్‌ ట్రాక్‌ చేయకూడదంటే.. మీ గూగుల్‌ అకౌంట్‌ ప్రైవసీ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవచ్చు. 

Image: RKC

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home